APPLICATION WINDOW FOR ADMISSION IGNOUS AICTE APPROVED MBA PROGRAMME OPEN DIRECT LINK HERE GH VB
IGNOU: ఇగ్నో నుంచి ఆ కోర్సుకు అడ్మిషన్లు ప్రారంభం.. పూర్తి వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సు-2022 అడ్మిషన్లను ప్రారంభించింది. ఈ మేరకు అప్లికేషన్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇగ్నో. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (SOMS) అందించే ఈ ఆన్లైన్ ఎంబీఏ(IGNOU MBA) కోర్సుకు గతంలోనే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆమోదం లభించింది.
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA) కోర్సు-2022 అడ్మిషన్లను ప్రారంభించింది. ఈ మేరకు అప్లికేషన్ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇగ్నో. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (SOMS) అందించే ఈ ఆన్లైన్ ఎంబీఏ(IGNOU MBA) కోర్సుకు గతంలోనే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఆమోదం లభించింది. ఈ ప్రోగ్రామ్ కనీస వ్యవధి రెండు సంవత్సరాలు. ఈ కోర్సును గరిష్ఠంగా నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని IGNOU పేర్కొంది. మొత్తం నాలుగు సెమిస్టర్లలో 28 సబ్జెక్టులు ఉంటాయి. వీటికి మొత్తం 116 క్రెడిట్లు లభిస్తాయి.
ఈ కోర్సులో తాజా మెటీరియల్‌ను అందిస్తున్నామని, సమకాలీన పాఠ్యాంశాలను నిపుణులు, ప్రఖ్యాత విద్యావేత్తలతో రూపొందించామని IGNOU తెలిపింది. ఈ MBA ప్రోగ్రామ్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ పై ఆన్లైన్ కోర్సు ద్వారానే నాలెడ్జ్ పొందొచ్చని ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ నయనతార పాధి తెలిపారు. రెగ్యులర్ కోర్సులకంటే భిన్నంగా రూపొందించిన ఈ ప్రోగ్రాం విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు.
IGNOU MBA స్పెషలైజేషన్లు..
స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (SOMS), IGNOU, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (IIBF)తో కలిసి ఈ కోర్సును రూపొందించింది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, సర్వీసెస్ మేనేజ్మెంట్ వంటి ఐదు విభిన్న స్పెషలైజేషన్లను అందిస్తోంది. భారతదేశ వ్యాప్తంగా ఇగ్నో కేంద్రాల్లో అందించే ఈ కోర్సు.. విదేశాల్లోనూ ఎంపిక చేసిన ఇగ్నో కేంద్రాల్లో అందుబాటులో ఉండనుంది.
అర్హతలు
మూడు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్/బ్యాచిలర్ డిగ్రీలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ ఆన్లైన్ కోర్సులో చేరేందుకు అర్హులు. ఇక రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు 45 శాతం మార్కులతో పాసై ఉంటే చాలు. వీరికి ఎటువంటి ప్రవేశ పరీక్ష ఉండదు. చివరిగా.. ఇదే కోర్సులో భాగంగా ఇగ్నో అందించే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో చేరే అభ్యర్థులు డిగ్రీ అర్హతతో పాటు.. ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్(CAIIB) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. దానికి సంబంధించిన క్రెడెన్షియల్స్నూ సమర్పించాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.