Home /News /jobs /

TCS Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి హైదరాబాద్ టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

TCS Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి హైదరాబాద్ టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ

TCS Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి హైదరాబాద్ టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ
(image: TCS)

TCS Jobs 2021: డిగ్రీ పాస్ అయినవారికి హైదరాబాద్ టీసీఎస్‌లో జాబ్స్... దరఖాస్తుకు రేపే చివరి తేదీ (image: TCS)

TCS Jobs 2021 | హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సర్వీస్ డెస్క్ రోల్ ఎగ్జిక్యూటీవ్ (Service Desk Role Executive) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రోజు మాత్రమే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
  మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు (MNC Jobs) కోరుకునే వారికి అలర్ట్. భారతదేశంలోనే కాదు... ప్రపంచంలోనే దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. సర్వీస్ డెస్క్ రోల్ ఎగ్జిక్యూటీవ్ (Service Desk Role Executive) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఖాళీల సంఖ్యను ప్రకటించలేదు. హైదరాబాద్‌లోని టీసీఎస్‌లో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA) పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 30 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు విద్యార్హతలు, ఇతర అర్హతల వివరాలు తెలుసుకోవాలి.

  TCS Service Desk Role Executive Jobs: టీసీఎస్ సర్వీస్ డెస్క్ రోల్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాల వివరాలు ఇవే...


  భర్తీ చేసే పోస్టు- సర్వీస్ డెస్క్ రోల్ ఎగ్జిక్యూటీవ్

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 30

  విద్యార్హతలు- బ్యాచిలర్స్ ఆఫ్ ఆర్ట్స్ పాస్ కావాలి

  జాబ్ డిస్క్రిప్షన్- గ్లోబల్ కస్టమర్లకు కాల్ సపోర్ట్ అందించాలి.

  అనుభవం- సర్వీస్ డెస్క్ సపోర్ట్ అందించేందుకు ఏడాదికి పైగా ఇంటర్నేషనల్ వాయిస్ ఎక్స్‌పీరియెన్స్ ఉండాలి.

  ఇతర స్కిల్స్- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ లాంగ్వేజ్‌ను సులభంగా వివరించి ట్రబుల్‌షూట్ చేసే సామర్థ్యం ఉండాలి. సమస్యలకు గల మూలాలను గుర్తించలిగే సాంకేతిక సామర్థ్యంతో పాటు వాటిని సంబంధిత టీమ్స్‌కు చేరవేసే పరిజ్ఞానం ఉండాలి. హార్డ్‌వేర్, నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి అంశాలకు సంబంధించిన సమస్యల్ని ఫోన్ ద్వారా పరిష్కరించగలగాలి.

  Railway Jobs: రైల్వేలో 3093 ఉద్యోగాలు... ఆ క్వాలిఫికేషన్ ఉంటే చాలు

  TCS Service Desk Role Executive Jobs: దరఖాస్తు చేయండి ఇలా


  Step 1- టీసీఎస్ ఐబిగిన్ ప్లాట్‌ఫామ్ https://ibegin.tcs.com/iBegin/jobs/208987J ద్వారా దరఖాస్తు చేయాలి.

  Step 2- పైన ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన తర్వాత అర్హతల వివరాలు ఓసారి చెక్ చేయాలి.

  Step 3- ఆ తర్వాత Apply పైన క్లిక్ చేయాలి.

  Step 4- కొత్త యూజర్లు Register with us పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 5- పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

  Step 6- ఆ తర్వాత సర్వీస్ డెస్క్ రోల్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుకు దరఖాస్తు చేయాలి.

  Step 7- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

  BSF Constable Jobs 2021: టెన్త్ పాస్ అయినవారికి బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ జాబ్స్... రూ.69,100 వేతనం

  మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్ (NQT) కోసం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. డిసెంబర్ 2021, మార్చి 2022 సెషన్లకు అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టింది. కాగ్నిటీవ్ స్కిల్స్, యాటిట్యూడినల్ అలైన్‌మెంట్ (సైకోమెట్రిక్ టెస్ట్), ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీ, ఐటీ ప్రోగ్రామింగ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ లాంటి పలు అంశాలపై అభ్యర్థులు తమ స్కిల్స్‌ని టెస్ట్ చేసేందుకు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. ఇందులో వచ్చిన స్కోర్ ద్వారా కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: CAREER, Job notification, JOBS, TCS

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు