డిగ్రీ విద్యార్థులకు గుడ్ న్యూస్. భారత పార్లమెంట్ రాజ్యసభలో ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ ప్రకటించింది. రాజ్యసభ స్టూడెంట్ రీసెర్చ్ అండ్ స్టడీ స్కీమ్-RSRS దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డీఎస్ రాధాకృష్ణన్ చెయిర్ ఫెలోషిప్, స్టూడెంట్ ఎంగేజ్మెంట్ ఇంటర్న్‌షిప్‌కు డిగ్రీ లేదా పీజీ పాస్ అయిన విద్యార్థులు ఈ అప్లై చేయొచ్చు. వేసవి సెలవుల్లో ఈ ఇంటర్న్‌షిప్, ఫెలోషిప్ చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఫెలోషిప్ మొదట రెండేళ్లు ఉంటుంది. ఆ తర్వాత మరో ఏడాది పొడిగిస్తారు. ఇక ఇంటర్న్‌షిప్ మొదట 18 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మరో 6 నెలలు పొడిగిస్తారు. ఫెలోషిప్ గ్రాంట్ ఏడాదికి రూ.8,00,000 లభిస్తుంది. దీంతో పాటు రూ.50,000 కాంటింజెన్సీ గ్రాంట్ కూడా లభిస్తుంది. ఇక ఇంటర్న్‌షిప్‌కు నెలకు రూ.10,000 లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్ లభిస్తుంది. ఈ ఫెలోషిప్, ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rajyasabha.nic.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
BRO Recruitment 2021: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవారికి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 459 జాబ్స్
DSSSB Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్... 1809 ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తులు
ఫెలోషిప్ ఖాళీలు- 4
ఇంటర్న్‌షిప్ ఖాళీలు- 10
గ్రాడ్యుయేట్స్- 5
పోస్ట్ గ్రాడ్యుయేట్స్- 5
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 31
విద్యార్హత- ఇంటర్న్‌షిప్ కోసం ఏదైనా డిగ్రీ లేదా పీజీ పాస్ కావాలి. ఫెలోషిప్ కోసం పీహెచ్డీ పాస్ కావాలి.
స్టైపెండ్- నెలకు రూ.10,000
ఇంటర్న్‌షిప్ గడువు- 18 నెలలు
ఫెలోషిప్ గడువు- 2 ఏళ్లు
దరఖాస్తు విధానం- https://rajyasabha.nic.in/ వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి ఇమెయిల్ ద్వారా పంపాలి. రాజ్యసభ ఫెలోషిప్ దరఖాస్తుల్ని rksahoo.rs@sansad.nic.in మెయిల్ ఐడీకి, ఇంటర్న్‌షిప్ దరఖాస్తుల్ని rssei.rsrs@sansad.nic.in మెయిల్ ఐడీకి పంపాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Rajya Sabha, Rajyasabha