APPLICATION PROCESS BEGINS FOR 3400 TEACHER JOBS IN EKLAVYA MODEL RESIDENTIAL SCHOOLS KNOW VACANCIES IN TELANGANA AND ANDHRA PRADESH SS
Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
Teacher Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 3400 టీచర్ ఉద్యోగాలకు మొదలైన దరఖాస్తు ప్రక్రియ
(ప్రతీకాత్మక చిత్రం)
Eklavya Model School Recruitment 2021 | టీచర్ ఉద్యోగం కోరుకునేవారికి గుడ్ న్యూస్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది.
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లల్లో 3400 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పీజీటీ, టీజీటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఖాళీలున్నాయి. తెలంగాణలో 262 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 11, వైస్ ప్రిన్సిపాల్- 6, పీజీటీ- 77, టీజీటీ- 168 ఖాళీలున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 117 పోస్టులు ఉండగా అందులో ప్రిన్సిపాల్- 14, వైస్ ప్రిన్సిపాల్- 6, టీజీటీ- 97 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంది. డీటెయిల్డ్ నోటిఫికేషన్‌ను https://tribal.nic.in/ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేసింది కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దరఖాస్తు విధానాన్ని నోటిఫికేషన్‌లో వివరించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ఈ నియామక ప్రక్రియ చేపట్టింది. అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్ https://recruitment.nta.nic.in/WebinfoEMRSRecruitment/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
Eklavya Model School Recruitment 2021: పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 3479
ప్రిన్సిపాల్- 175
వైస్ ప్రిన్సిపాల్- 116
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్- 1244
ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్- 1944
Eklavya Model School Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 30
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2021 మే 1 రాత్రి 11.50 గంటలు
దరఖాస్తులో తప్పులు సరిదిద్దుకోవడానికి- 2021 మే 4 నుంచి 6
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్- త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
పరీక్ష తేదీ- మే చివరి వారం లేదా జూన్ మొదటి వారం
ఇంటర్వ్యూ షెడ్యూల్- త్వరలో వెల్లడించనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
Eklavya Model School Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- ప్రిన్సిపాల్ పోస్టుకు ఏదైనా స్కూలింగ్ సబ్జెక్ట్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పాస్ కావాలి. లేదా టీచింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 10 ఏళ్లు ఇంగ్లీష్ మీడియం హయ్యర్ సెకండరీ స్కూల్ టీచర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. టీజీటీ, పీజీటీ పోస్టుకు మాస్టర్స్ డిగ్రీతో పాటు బీఈడీ పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ పోస్టుకు రూ.2,000. పీజీటీ, టీజీటీ పోస్టుకు రూ.1,500.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ.
ఎగ్జామ్ డ్యూరేషన్- 180 నిమిషాలు
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం 288 స్కూల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మరో 452 స్కూళ్లను ప్రారంభిస్తోంది. దీంతో మొత్తం స్కూళ్ల సంఖ్య 740 కి చేరుకోనుంది. ఇప్పటికే రాష్ట్రాల నుంచి 100 పాఠశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందాయి. త్వరలో స్కూళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.