కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు హైస్కూల్ విద్యార్థులు (High School Students) తమ అప్లికేషన్ అవతార్ (Application)ను చక్కగా రెడీ చేసుకోవాలి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ హైస్కూల్ స్టూడెంట్స్(High School Students) మంచి కాలేజీలో చేరాలంటే బెస్ట్ అప్లికేషన్(Best Application) బిల్డ్ చేసుకోవడం తప్పనిసరి. అయితే ఇంటర్నేషనల్ విద్యార్థులు (International Students) యునైటెడ్ స్టేట్స్‌లో (United States) అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) ప్రోగ్రామ్‌ల కోసం తరచుగా దరఖాస్తు చేసుకుంటారు. ఈ దరఖాస్తు ప్రక్రియ మార్క్ షీట్‌లు(Marks Sheet), టెస్ట్ స్కోర్‌ల వంటి అకడమిక్ రికార్డ్స్ మాత్రమే కాకుండా, ఫేమస్ యాక్టివిటీలు ప్రదర్శించడానికి కూడా ఒక వేదికగా నిలుస్తుంది. ఈ అప్లికేషన్ ప్రక్రియను విద్యార్థులు తమ వ్యక్తిత్వం, యాక్టివిటీల్లో ఇంట్రెస్ట్స్ వ్యక్తపరచడానికి ఒక ప్లాట్‌ఫామ్ గా భావిస్తారు. గ్రాడ్యుయేట్ కాలేజీలో అడ్మిషన్ దక్కించుకునేందుకు అప్లికేషన్ ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ కోసం చేసే అప్లికేషన్ ద్వారా విద్యార్థులు హైస్కూల్‌లో ఉన్న సమయం నుంచి గరిష్టంగా 10 ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీల్లో తమ విజయాలను చూపించవచ్చు. పాఠ్యేతర కార్యకలాపాలలో (Extracurricular Activities) పాల్గొనడం అనేది విద్యార్థి సంఘంలో దరఖాస్తుదారు బలాలను నిర్ణయించడంలో దోహదపడుతుంది. సాధారణంగా మెరిట్, ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్‌లు ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీలను దృష్టిలో పెట్టుకొనే ఆఫర్ చేస్తారు. విద్యార్థులు అప్లికేషన్‌లో ఈ యాక్టివిటీల గురించి వివరించడం ద్వారా కాలేజీల సెలెక్షన్ బృందాన్ని మెప్పించి అడ్మిషన్ పొందొచ్చు. కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే విద్యార్ధులు తమ అకడమిక్, ఎక్స్‌ట్రా కరిక్యులర్ అవతార్‌లను మెరుగుపరచుకోవాలి. అప్లికేషన్‌లలో స్ట్రాంగ్ అవతార్‌లను చూపించాలి.
ఆసక్తులను గుర్తించాలి అప్లికేషన్ ఉత్తమంగా సిద్ధం చేసుకునేందుకు మొదట మీరు మీ ఇంట్రెస్ట్స్ లేదా ఆసక్తులను గుర్తించడం ముఖ్యం. అలాగే మీ అప్లికేషన్ మీ ఆసక్తులు, సహజ అభిరుచులను హైలైట్ చేసేలా ఉండాలి. ప్రస్తుతం మీ పాఠశాలలో మీ ఇంట్రెస్ట్స్ మెరుగుపరిచే అవకాశాలు లేకపోతే టీచర్లతో మాట్లాడాలి. మీ పాఠశాల అధికారులతో మాట్లాడి మీకు కావాల్సిన యాక్టివిటీ క్లబ్ కోసం ప్రయత్నించాలి. మీ హైస్కూల్‌లో ఇప్పటికే యాక్టివిటీలు, క్లబ్‌లు అందుబాటులో ఉన్నట్లయితే వాటిపై మీకున్న ఇంట్రెస్ట్ పెంచుకోవచ్చు. నేచర్ క్లబ్‌లు, కల్చరల్ క్లబ్‌లు, ట్రెక్కింగ్ గ్రూపులు, స్కౌట్స్, స్కూల్ మ్యాగజైన్‌లు, ఎడిటోరియల్ బోర్డ్‌లు, స్పోర్ట్స్ టీమ్‌లు, డిబేటింగ్ సర్కిల్‌లు వంటి చాలా క్లబ్‌లు హైస్కూల్స్ లో అందుబాటులో ఉంటాయి. ఈ యాక్టివిటీలలో తరచుగా పాల్గొంటూ మీరు బాగా రాణించాలి. అంతిమంగా, నాయకత్వ స్థానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. నాయకత్వాన్ని ప్రదర్శించడం, చొరవ తీసుకోవడం వంటివి అడ్మిషన్ కమిటీలు ప్రశంసించే లక్షణాలు.
మీ అథ్లెటిక్ ప్రతిభను ఉపయోగించాలిఅథ్లెటిక్ టాలెంటుతో యూనివర్సిటీలలో అథ్లెటిక్ స్కాలర్‌షిప్ లేదా మెరిట్, ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్‌లకు అర్హత పొందవచ్చు. అయితే, మీరు ఎనిమిదవ తరగతి ముందు నుంచే అథ్లెటిక్స్ స్పోర్ట్స్ ఆడుతుండాలి. మీ అథ్లెటిక్ టాలెంట్ గురించి యూనివర్సిటీ కోచ్‌లతో కమ్యూనికేట్ అయ్యాక వారు యూనివర్సిటీని బట్టి మీకు అడ్మిషన్‌లు ఆఫర్ చేస్తారు. మీరు యూనివర్సిటీల జట్లకు సరిపోతారో లేదో తెలుసుకోవడానికి కోచ్‌లు హైస్కూల్ స్పోర్ట్స్ సీజన్‌లలో మీ పనితీరును పరిశీలించవచ్చు.
కమ్యూనిటీతో కనెక్ట్ అవ్వాలి కమ్యూనిటీ, పరిసరాల్లోని యాక్టివిటీలలో పాల్గొనాలి. స్పోర్ట్స్ క్లబ్‌లు, లాంగ్వేజ్ క్లాసుల వంటి వాటిలో చేరాలి. జూనియర్ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పడం, క్లీన్-అప్ డ్రైవ్‌లలో పాల్గొనడం, స్థానిక సంస్థకు సహాయం చేయడం ఇంకా ఇతరత్రా యాక్టివిటీలు చేస్తే మంచిది. ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి.
స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి అప్లికేషన్ అవతార్‌ను డెవలప్ చేయడానికి మీ సమ్మర్, వీకెండ్స్ సద్వినియోగం చేసుకోవాలి. స్కిల్స్ పెంచుకోవడానికి ఈ సమయాలు బాగా ఉపయోగపడతాయి. ఉన్నతమైన విద్యా సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీ అప్లికేషన్‌లోని కోర్సుల జాబితాకు ఆన్‌లైన్, అడ్వాన్స్‌డ్ ప్లేస్‌మెంట్ కోర్సులు జత చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.