Apple Recruitment: నిరుద్యోగులకు యాపిల్​ శుభవార్త.. బీటెక్ హోల్డర్స్ సిద్ధం అవ్వండి

(ప్రతీకాత్మక చిత్రం)

టెక్​ దిగ్గజం, ఐఫోన్ (Iphone) తయారీ సంస్థ ఆపిల్ నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. బెంగుళూరు(Bangalore) లోని యాపిల్​ కేంద్రంలో కొత్తగా సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లను(Software Engineer), ఇంటర్న్‌(Intern) లను నియమించుకోవాలని యోచిస్తోంది.

  • Share this:
టెక్​ దిగ్గజం, ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్ (Apple) నిరుద్యోగులకు గుడ్​న్యూస్​ చెప్పింది. బెంగుళూరులోని యాపిల్​ కేంద్రంలో కొత్తగా సాఫ్ట్​వేర్​ ఇంజనీర్లను (Software Engineers), ఇంటర్న్‌(intern)లను నియమించుకోవాలని (Recruitment) యోచిస్తోంది. ఎంపికైన ఇంటర్న్‌లకు 2022 జనవరి నుంచి జులై మధ్య కాలంలో శిక్షణనిస్తుంది(Training). అమెరికా (America)కు చెందిన యాపిల్​ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తన సేవలను విస్తరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా భారత్(India)​లో ఐటీ వృద్ధి కారణంగా ఇక్కడి యువతకు ఇంటర్న్​షిప్ (internship)​ ద్వారా శిక్షణనిచ్చి సంస్థలో నియమించుకోవాలని భావిస్తోంది. స్థానిక డెవలపర్లకు(Developers) శిక్షణనిచ్చేందుకు యాపిల్​ యాప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్​ ద్వారా పెద్ద ఎత్తున ఫ్రెష్​ గ్యాడ్యుయేట్లకు (Fresh Graduates) ఇంటర్న్‌షిప్​(Internship) అవకాశం కల్పిస్తోంది. ఇప్పటివరకు, ఈ కార్యక్రమం కింద 8 లక్షలకు పైగా ఉద్యోగులను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నియమించుకుంది.

ఈ కొత్త ప్రోగ్రామ్​పై యాపిల్ (Apple)​ తన బ్లాగ్​పోస్ట్​లో పేర్కొంటూ “ప్రపంచంలో యాపిల్ ఐఫోన్‌ (Iphone)లను తయారు చేసే అతికొద్ది దేశాలలో భారతదేశం (India) ఒకటి. మేము స్థానికంగా ఐఫోన్ 12, ఐఫోన్ ఎస్ఈ, ఐఫోన్ 11, ఐఫోన్ ఎక్స్‌ఆర్‌లను తయారు చేయడం గర్వంగా ఉంది. గతంలో ఐఫోన్ 7, ఐఫోన్ 6 ఎస్, మొదటి తరం ఐఫోన్ ఎస్‌ఈలను కూడా ఇక్కడే తయారు చేశాం. ఇప్పుడు మా మార్కెట్​ను మరింత విస్తరించాలని యోచిస్తున్నాం.

అందుకే, కొత్తగా ఇంటర్న్​షిప్​ అవకాశాలు కల్పిస్తున్నాం. మా యూజర్ల విభిన్న ఆలోచనలు, ఆవిష్కరణలకు మేము ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తాం. వారి అభిరుచులకు తగ్గట్లు ఐఫోన్లు, కొత్త ప్రొడక్ట్స్​ను అందుబాటులోకి తెస్తున్నాం. రాబోయే కాలంలో యాపిల్​ మరిన్ని అద్భుతాలు సృష్టించనుంది. అసాధారణమైన ఉత్పత్తులు, సేవలు, కస్టమర్లకు మెరుగైన అనుభవాలు అందించడంలో ఎప్పుడూ ముందుంటాం.” అని కంపెనీ వెబ్‌సైట్​లో పేర్కొంది.

యాపిల్ ఇండియాలో ఖాళీలు..
యాపిల్ ప్రస్తుతం అనేక ఇంజనీరింగ్ విభాగాల్లో నియామకాలు చేపట్టింది. నెట్‌వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్​, గ్లోబల్ నెట్‌వర్క్ సర్వీసెస్, సెల్యులార్ సిస్టమ్స్ అనాలిసిస్ ఇంజనీర్, యాక్సెసిబిలిటీ టెక్నాలజీలో సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్, రెగ్యులేటరీ కంప్లయన్స్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, డేటా ప్లాట్‌ఫాం బిజినెస్ అనలిస్ట్/సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, కస్టమర్ సిస్టమ్స్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, యాడ్ ప్లాట్​ఫామ్​లో సీనియర్ ఆర్కిటెక్ట్​ తదితర నియామకాలు చేపట్టింది.

ఇవి చదవండి..

Xiaomi: స్మార్ట్ ఫోన్ కంపెనీ షియోమి నుంచి త్వరలోనే Electric Car విడుదల...

Top electric scooters in india 2021: ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా..టాప్ 5 చాయిస్ ఇవే...

క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ ఎడిషన్‌ డిజైన్ స్కెచ్‌లను విడుదల చేసిన హ్యూందాయ్‌

బైక్ కోసం ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారా..? క్లెయిమ్ ఎప్పుడు రిజెక్ట్ అవుతుందో
Published by:Krishna Adithya
First published: