APPLE IS COMMENCING ASSEMBLY OF ITS IPHONE 12 MODEL IN INDIA NS GH
Apple iPhone 12: ఇకపై భారత్‌లోనే ఐఫోన్ 12 తయారీ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు.. వివరాలివే
ప్రతీకాాత్మక చిత్రం
యాపిల్ కంపెనీ ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్లను మన దేశంలోనే అసెంబుల్ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
యాపిల్ కంపెనీ ఇక భారత్‌లో తమ ఉత్పత్తులను తయారు చేయాలని నిర్ణయించింది. ఇప్పటి నుంచి ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్లను మన దేశంలోనే అసెంబుల్ చేయనున్నారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విభాగంలో సంస్థ మెరుగైన స్థానానికి చేరుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. తమ పార్టనర్ కంపెనీ ఫాక్స్‌కాన్ సాయంతో తమిళనాడులో ఉన్న ప్లాంటులో ఐఫోన్ 12 ఫోన్లను అసెంబుల్ చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఈ విషయాన్నికేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన వార్తా పత్రిక క్లిప్పింగ్‌ను ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. యాపిల్ నిర్ణయం వల్ల మన దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని ట్వీట్ చేశారు.
యాపిల్ 2017లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ప్రారంభించింది. ఈ సంస్థకు ఫాక్స్ కాన్, విస్రాన్ వంటి థర్డ్ పార్టీ మ్యాన్యూఫాక్చరింగ్ కంపెనీలతో పార్ట్ నర్షిప్ ఉంది. వీటి సాయంతో యాపిల్ మన దేశంలో ఉత్పత్తులను తయారుచేస్తోంది. భారత్‌లో ఐఫోన్ 12 మోడళ్ల తయారీపై యాపిల్ నిర్ణయం తీసుకోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంస్థ అధికారికంగా స్పందించింది. ప్రస్తుతం ఐఫోన్ 12 బేస్ మోడళ్లను మాత్రమే భారత్‌లో తయారు చేస్తామని యాపిల్ ప్రకటించింది. ఎప్పటిలాగానే చైనా నుంచి ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ 12 ప్రో మ్యాక్స్ మోడళ్ల దిగుమతులు కొనసాగుతాయని సంస్థ వెల్లడించింది.
ఐఫోన్ 12 ప్రత్యేకతలు
యాపిల్ ఐఫోన్ 12 మోడళ్లలో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్ప్లే, సిరామిక్ షీల్డ్ గ్లాస్ టెక్నాలజీ, IP68 రేటింగ్ వాటర్ రెసిస్టెన్స్, 15 W వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవి iOS 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. ఐఫోన్ 12లో రెండు 12 MP కెమెరాలు ఉన్నాయి. ఈ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో క్వాలిటీ ఫోటోలు తీసుకోవచ్చు. ఐఫోన్ 12.. 64 GB వేరియంట్ ధర రూ.79,900గా ఉంది. 128 GB స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.84,900, 256 GB వేరియంట్ ధర రూ.94,900గా ఉంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.