హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In Apple Store: యాపిల్ స్టోర్ లో ఉద్యోగాలు.. వారానికి 40 గంటల పని..

Jobs In Apple Store: యాపిల్ స్టోర్ లో ఉద్యోగాలు.. వారానికి 40 గంటల పని..

Jobs In Apple Store: యాపిల్ స్టోర్ లో ఉద్యోగాలు.. వారానికి 40 గంటల పని..

Jobs In Apple Store: యాపిల్ స్టోర్ లో ఉద్యోగాలు.. వారానికి 40 గంటల పని..

యాపిల్ తన మొదటి ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్టోర్ మార్చి 2023లో ముంబైలోని 22,000 చదరపు అడుగుల ప్రదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

యాపిల్(Apple) తన మొదటి ఫ్లాగ్‌షిప్ రిటైల్ స్టోర్‌ను భారతదేశంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫ్లాగ్‌షిప్ స్టోర్ మార్చి 2023లో ముంబైలోని 22,000 చదరపు అడుగుల ప్రదేశంలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఇప్పుడు భారతదేశంలోని దాని మొదటి ఫ్లాగ్‌షిప్(Flagship) మరియు అనేక ఇతర రిటైల్ స్టోర్‌ల కోసం ఉద్యోగులను నియమించుకునే పని పడింది. Apple కెరీర్‌ల వెబ్‌సైట్‌లోని ఉద్యోగ జాబితాలు ఇదే విషయాన్ని నిర్ధారిస్తున్నాయి. కుపెర్టినో-టెక్ ఆధారిత దిగ్గజం సాధారణంగా 100 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉన్న Apple ఫ్లాగ్‌షిప్ స్టోర్‌గా(Store) భారతదేశం నుండి 100 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే పలు పోస్టులు భర్తీ చేయగా.. ఇంకా చాలా వరకు ఖాళీలు ఉన్నాయి.

ఆపిల్ ప్రస్తుతం భారతదేశంలో తన మొదటి ఫ్లాగ్‌షిప్ స్టోర్ కోసం వివిధ కేటగిరీలో ఉద్యోగులను నియమింకోనుంది. వాటిలో ఎక్కువగా.. స్టోర్ లీడర్, స్పెషలిస్ట్, సీనియర్ మేనేజర్, ఆపరేషన్స్ ఎక్స్‌పర్ట్, మార్కెట్ లీడర్, మేనేజర్ తో పాటు.. మరిన్నింటి కోసం కంపెనీ ఉద్యోగ జాబితాలను ఉంచింది.

యాపిల్ ఇండియా రిటైల్ స్టోర్స్‌లో ప‌నిచేసే ఉద్యోగులు వారానికి 40 గంట‌లు ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని కంపెనీ ప్రకటించింది. అభ్య‌ర్ధుల‌కు ఇంగ్లీష్‌తో పాటు స్ధానిక భాష‌పై ప‌ట్టు ఉండాల‌ని సూచించింది. దరఖాస్తు చేయాలనుకునే ఎవరైనా.. Apple కెరీర్ వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం వెబ్ సైట్లో 140 పైగా ఉద్యోగాలు ఉన్నట్లు చూపిస్తోంది. Apple తన ఉద్యోగులకు ఆరోగ్య బీమా , విద్యాప్రోత్సాహకాలతో పాటు.. ఇన్సురెన్స్ బెనిఫిట్స్ లాంటివి అందిస్తుంది.

GK Capsule: ఢిల్లీ కోల్డ్ వేవ్ నుంచి ఒమిక్రాన్ కొత్త వేరియంట్ వరకు.. కరెంట్‌ అఫైర్స్‌ అప్‌డేట్స్‌ ఇలా..

ఇదిలా ఉండగా.. ఆపిల్ తన ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లో భారతదేశంలో ప్రారంభించింది. 2021లోనే ముంబైలో తొలి రిటైల్ ఔట్ లెట్ ప్రారంభించాలనుకున్నా కోవిడ్ కారణంగా అది ఆలస్యమైంది. ఆఫ్‌లైన్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను సంవత్సరాలుగా ప్లాన్ చేస్తోంది. భారతదేశంలో ఈ సంవత్సరం అది కార్యరూపం దాల్చింది. మరోవైపు.. టాటా గ్రూప్ తన వివిధ ఉత్పత్తులను విక్రయించడానికి భారతదేశంలో ఇటువంటి 100 రిటైల్ స్టోర్‌లను తెరవడానికి ఆపిల్‌తో టచ్‌లో ఉంది. ఈ స్టోర్ లు ఎక్కువగా మాల్స్ లోపల  విస్తరించనున్నాయి. యాపిల్ ఏడాది కాలంగా భారత్‌పై ఎక్కువ దృష్టి సారించింది. అక్టోబర్ 2022లో.. ఆపిల్ భారతదేశంలో రికార్డు స్థాయిలో ఐఫోన్‌లను విక్రయిస్తోందని టిమ్ కుక్ వెల్లడించారు .

BRO Recruitment 2023: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో 567 ఖాళీలు.. రిక్రూట్‌మెంట్ వివరాలు ఇవే..

భారతదేశంలోని ఆపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఉత్పత్తిని భారీగా పెంచబోతున్నారని మరో నివేదిక చెబుతోంది. Foxconn, Pegatron, Wistron ప్రభుత్వ రూ. 41,000 కోట్ల PLI పథకం ద్వారా ఉత్పత్తిని పెంచాలని యోచిస్తున్నాయి. గత నెలలో, యాపిల్ చైనాలోని ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ప్లాంట్‌లో నిరసన కారణంగా భారీ కొరతను ఎదుర్కొంది. యాపిల్ తదుపరి వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారతదేశాన్ని చూస్తోంది.

First published:

Tags: Apple, Degree jobs, JOBS

ఉత్తమ కథలు