దృష్టిలోపం ఉన్న విద్యార్థులు(Students) సొంతంగా పరీక్షలు రాయలేరు. ఎగ్జామ్‌కు(Blind person exam) అటెండ్ అవుతున్నారంటే.. వారి తరఫున పరీక్ష రాసే ఓ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది. సంబంధిత వివరాలను పరీక్ష నిర్వాహకులకు ముందుగానే చెప్పాలి. ఇటువంటి అసౌకర్యాల కారణంగా పరీక్షల సమయంలో అంధ విద్యార్థులు (Blind students) చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఎవరి సహాయం లేకుండానే అంధ విద్యార్థులు మరాఠీ భాషలో పరీక్షలు రాసేందుకు వీలుగా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది ఓ ఎన్జీఓ. దీని సహాయంతో వారు సులువుగా పరీక్ష పూర్తి చేస్తారని చెబుతోందీ స్వచ్ఛంద సంస్థ.
Govt Jobs 2022: ఈ వారం మీరు అప్లై చేయాల్సిన టాప్ 5 ఉద్యోగాలు.. దరఖాస్తు వివరాలు
మహారాష్ట్ర పూణేకు చెందిన నివంత్ అంధ్ ముక్త్ వికాసాలయ(Niwant Andh Mukta Vikasalaya) అనే ఎన్జీఓ.. అంధ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపుతూ.. వారి బాగోగుల కోసం పనిచేస్తుంటుంది. ఈ సంస్థే నగరానికి చెందిన ఐటీ కంపెనీ జోష్ సాఫ్ట్‌వేర్‌తో కలిసి స్వలేఖన్ అనే యాప్‌ను రూపొందించింది. ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ టెక్స్ట్-టు-స్పీచ్ అప్లికేషన్ మరాఠీ టైపింగ్(Marathi typing) ట్యూటర్‌గా పని చేస్తుంది. ఎగ్జామ్ రాసేవారు మాట్లాడితే చాలు, ఈ యాప్ దాన్ని టెక్స్ట్‌గా మార్చి పరీక్ష రాయడంలో సహాయపడుతుంది. ఈ యాప్ ఆడియో ఫైల్ పాఠాలను కూడా కలిగి ఉంటుంది. విద్యార్థుల భావాలను స్పష్టంగా, పర్ఫెక్ట్గా అర్థం చేసుకునేలా దీనిని తయారుచేశారు.
దాదాపు 13 గంటల కంటే ఎక్కువ కంటెంట్‌ను దీనిలో పొందుపరిచారు. అంధ విద్యార్థులకు సాధారణ సమయాల్లోనూ ఉపయోగపడేలా క్విజ్‌లు, ఇంటరాక్టివ్ గేమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ యాప్‌ను ది పూణా బ్లైండ్ స్కూల్, శ్రీరాంపూర్, నాందేడ్, నాసిక్, ఔరంగాబాద్‌లోని అంధ విద్యార్థుల కోసం పలు విద్యా సంస్థలు ఉపయోగిస్తున్నాయి.
"నాలాంటి విద్యార్ధులు పాఠాలు త్వరగా నేర్చుకునేందుకు, మరింత బాగా చదివేందుకు స్వలేఖన్ యాప్ సహాయపడుతుంది" అని గాయత్రీ మిత్కారీ అనే విద్యార్థిని తెలిపింది. దీనివల్ల తనలో మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది. ‘ఈ యాప్ ద్వారా నా పరీక్ష నేనే రాశా. సహజమైన వేగంతో, నాదైన శైలిలో రాసే స్వేచ్ఛ వచ్చనట్లు అనిపించింది. రైటింగ్‌లో మెరుగ్గా రాణించేందుకు సహాయపడుతోంది. తద్వారా ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు వీలు కలిగింది’ అని ది పూణా బ్లైండ్ స్కూల్ విద్యార్థిని అంబికా గవాటే తెలిపింది.
RRB Group D Exam: రైల్వే జాబ్ మీ కలనా.. సెలబస్ అండ్ 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్!
నీతిరాజ్ దేశ్‌ముఖ్ అనే పూర్వ విద్యార్థి స్వలేఖన్ అప్లికేషన్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు. అంధుడిగా తన అనుభవాల ఆధారంగా దీనిని చేపట్టినట్లు దేశ్‌ముఖ్ పేర్కొన్నాడు. "సాంకేతికతపై నాకున్న ప్రేమతో స్వలేఖన్ యాప్ తయారీలో సహాయం చేశా. నేను ఎదుర్కొన్న ఇబ్బందులను తర్వాతి తరం వారు పడకూడదనేది నా తాపత్రయం" అని నీతిరాజ్ వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams