Home /News /jobs /

APOLLO HOSPITALS RECRUITING 120 VACANCIES IN ANDHRA PRADESH KNOW ALL DETAILS SS

Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌లో 120 ఉద్యోగాలు... నెలకు రూ.18,000 వేతనం

Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌లో 120 ఉద్యోగాలు... నెలకు రూ.18,000 వేతనం
(ప్రతీకాత్మక చిత్రం)

Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్‌లో 120 ఉద్యోగాలు... నెలకు రూ.18,000 వేతనం (ప్రతీకాత్మక చిత్రం)

APSSDC Jobs 2020 | అపోలో హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఉద్యోగాల వివరాలు తెలుసుకోండి.

    ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. అపోలో హాస్పిటల్స్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ట్వీట్ చేసింది. ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన ప్రకారం పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్-PMOA పోస్టుల్ని భర్తీ చేస్తోంది అపోలో హాస్పిటల్స్‌. మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది అపోలో హాస్పిటల్స్‌. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతంలో అయినా పోస్టింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు లింక్ ఇదే వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 నవంబర్ 23 లోగా అప్లై చేయాలి.

    DRDO Scholarship: ప్రతీ ఏడాది రూ.1,86,000 స్కాలర్‌షిప్... అప్లై చేయడానికి 2 రోజులే గడువు

    Bank Jobs 2020: మొత్తం 647 బ్యాంకు ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా

    APSSDC Jobs 2020: ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇవే


    భర్తీ చేసే పోస్టు- పారామెడికల్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ (PMOA)
    మొత్తం ఖాళీలు- 120
    దరఖాస్తు చేయడానికి చివరి తేదీ- 2020 నవంబర్ 23
    విద్యార్హత- డిప్లొమా ఇన్ ఆప్తమాలిక్ అసిస్టెంట్ లేదా బీఎస్సీ (ఆప్టోమెట్రీ)
    ఇతర అర్హతలు- ఫ్రెషర్ లేదా అనుభవం ఉన్నవారు అప్లై చేయొచ్చు. పురుషులు, మహిళలు దరఖాస్తు చేయొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషలు తెలిసి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ స్కిల్స్ తప్పనిసరి.
    వయస్సు- 35 ఏళ్ల లోపు
    వేతనం- నెలకు రూ.18,000
    ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
    వర్క్ లొకేషన్- ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా పోస్టింగ్
    ఇంటర్వ్యూకు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్- సీవీ, ఫోటో, అన్ని డాక్యుమెంట్స్ రెండు సెట్స్

    APSSDC Jobs 2020: అప్లై చేయండి ఇలా


    https://www.apssdc.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.
    అప్లై చేసిన తర్వాత డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్-DSDO దరఖాస్తుల్ని పరిశీలించి ఇంటర్వ్యూకు పిలుస్తుంది.
    ఇంటర్వ్యూలో క్లినికల్ ఆపరేషన్స్, హెచ్ఆర్ రౌండ్ ఉంటాయి.



    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ లో ఇతర కంపెనీలకు చెందిన రిక్రూట్‌మెంట్ నోటీసులు కూడా ఉంటాయి. అన్ని అర్హతలు ఉన్నవారు ఈ వెబ్‌సైట్‌లో ఉద్యోగ ప్రకటనలు చూడొచ్చు.  మరిన్ని వివరాలను 1800 4252 422 నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Telugu news, Telugu updates, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు