APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 398 ఎనర్జీ అసిస్టెంట్ జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

APEPDCL Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లో 398 ఎనర్జీ అసిస్టెంట్ జాబ్స్... 2 రోజులే గడువు (ప్రతీకాత్మక చిత్రం)

APEPDCL Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ సంస్థలో ఉద్యోగాల భర్తీకి (Jobs in Andhra Pradesh) దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి.

  • Share this:
    ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్-APEPDCL ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎనర్జీ అసిస్టెంట్‌ని జూనియర్ లైన్‌మ్యాన్ గ్రేడ్ 2 (Junior Lineman Grade II) అని కూడా పిలుస్తారు. మొత్తం 398 ఖాళీలు ఉన్నాయి. కేవలం పురుషులు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎంపికైనవారు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్-APEPDCL పరిధిలోని గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయంలో పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 24 చివరి తేదీ. 2021 అక్టోబర్ 10న ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.



























    మొత్తం ఖాళీలు 398
    శ్రీకాకుళం 88
    విజయనగరం 74
    విశాఖపట్నం 71
    రాజమండ్రి 122
    ఏలూరు 43

    SBI SCO Recruitment 2021: రూ.78,000 వరకు వేతనంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా

    APEPDCL Energy Assistants Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


    ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 30

    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 24

    హాల్ టికెట్ డౌన్‌లోడ్- 2021 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు

    పరీక్ష తేదీ- 2021 అక్టోబర్ 10

    ఫలితాల విడుదల- 2021 అక్టోబర్ 22

    Indian Navy Jobs 2021: ఇండియన్ నేవీలో 230 ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి

    APEPDCL Energy Assistants Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    విద్యార్హతలు- అభ్యర్థులు 10వ తరగతితో పాటు ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు, ఇన్‌స్టిట్యూట్ నుంచి రెండేళ్ల ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్ అండ్ రీవైండింగ్ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్ లేదా ఎలక్ట్రికల్ వైరింగ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సుు పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.

    వయస్సు- 2021 జూలై 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

    దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.700. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.350.

    వేతనం- అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత రెండేళ్ల పాటు నెలకు రూ.15,000 వేతనం లభిస్తుంది.

    Jobs in Wipro: విప్రోలో ఫ్రెషర్స్‌కి 30,000 ఉద్యోగాలు... ఏడాదికి రూ.3,50,000 వేతనం

    APEPDCL Energy Assistants Recruitment 2021: అప్లై చేయండి ఇలా...


    Step 1- ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ముందుగా అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.

    Step 2- ఆ తర్వాత https://recruitment.apeasternpower.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

    Step 3- హోమ్ పేజీలో Fill Online Application పైన క్లిక్ చేయాలి.

    Step 4- దరఖాస్తు ఫామ్ పూర్తి చేయడానికి ముందే ఫీజు చెల్లించాలి.

    Step 5- ఇందుకోసం Click Here to Pay Amount పైన క్లిక్ చేయాలి.

    Step 6- అభ్యర్థి బేసిక్ వివరాలు ఎంటర్ చేసి ఫీజు పేమెంట్ చేయాలి.

    Step 7- ఆ తర్వాత అభ్యర్థి తన వివరాలతో అప్లికేషన్ ఫామ్ నింపాలి.

    Step 8- తర్వాత ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

    Step 9- చివరగా దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

    Step 10- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
    Published by:Santhosh Kumar S
    First published: