హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

APCPDCL Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

APCPDCL Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

APCPDCL Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్‌లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్-APCPDCL లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 1) పోస్టుల్ని భర్తీ చేస్తోంది APCPDCL. మొత్తం 86 ఖాళీలున్నాయి. విజయవాడ, గుంటూరు, సీఆర్‌డీఏ, ఒంగోలులో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 మే 3 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://apcpdcl.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోండి.

  APCPDCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


  నోటిఫికేషన్ విడుదల- 2021 ఏప్రిల్ 6

  దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 7

  దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 3

  దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం- 2021 మే 10 నుంచి మే 14

  హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్- 2021 మే 18 నుంచి మే 22

  రాతపరీక్ష- 2021 మే 23 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు

  ప్రిలిమినరీ కీ విడుదల- 2021 మే 23

  ప్రిలిమినరీ కీపైన అభ్యంతరాల స్వీకరణ- 2021 మే 24 నుంచి మే 26

  ఫలితాల విడుదల- 2021 మే 31

  Online Startup Ideas: ఇంట్లోనే ఉంటూ డబ్బు సంపాదించడానికి 10 ఐడియాలు

  NHAI Recruitment 2021: నేషనల్ హైవేస్ అథారిటీలో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

  APCPDCL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


  మొత్తం ఎనర్జీ అసిస్టెంట్ (జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్ 1) ఖాళీలు- 86

  విజయవాడ- 38

  గుంటూరు- 13

  సీఆర్‌డీఏ- 3

  ఒంగోలు- 32

  APCPDCL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


  విద్యార్హతలు- 10వ తరగతి పాస్ కావాలి. ఎలక్ట్రికల్ ట్రేడ్ లేదా వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. లేదా ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్, రీవైండింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ పాస్ కావాలి.

  ఎంపిక విధానం- రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, మీటర్ రీడింగ్

  వయస్సు- 2021 జనవరి 31 నాటికి 18 నుంచి 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయస్సులో 5 ఏళ్లు సడలింపు

  దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350.

  వేతనం- నెలకు రూ.15,000.

  India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ అభ్యర్థులకు అలర్ట్... ఫలితాలు ఎప్పుడంటే

  ECIL Recruitment 2021: ఈసీఐఎల్‌లో 111 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే


  APCPDCL Recruitment 2021: అప్లై చేయండి ఇలా


  అభ్యర్థులు ముందుగా నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.

  నోటిఫికేషన్ https://recruitment.apcpdcl.in వెబ్‌సైట్‌లో ఉంటుంది.

  ఆ తర్వాత ఇదే వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌పైన క్లిక్ చేసిన తర్వాత Apply Online పైన క్లిక్ చేయాలి.

  మొదట ఫీజు పేమెంట్ చేయాలి.

  ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.

  దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసేముందు వివరాలన్నీ ఓసారి సరిచూసుకోవాలి.

  దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh news, Andhra updates, AP News, CAREER, Crda, Exams, Govt Jobs 2021, Guntur, Job notification, JOBS, NOTIFICATION, Ongole, Telugu news, Telugu updates, Telugu varthalu, Vijayawada

  ఉత్తమ కథలు