AP Village Secretary Posts : ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు... ఒకేసారి 91వేలకు పైగా పోస్టుల భర్తీ

AP Village Secretary Posts 2019 : నిరుద్యోగుల పంట పండబోతోంది. ఏపీ వైసీపీ ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా... గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చెయ్యబోతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 8:14 AM IST
AP Village Secretary Posts : ఏపీలో గ్రామ సచివాలయ ఉద్యోగాలు... ఒకేసారి 91వేలకు పైగా పోస్టుల భర్తీ
ఏపీ ప్రభుత్వ లోగో (Image : Wikipedia)
Krishna Kumar N | news18-telugu
Updated: July 20, 2019, 8:14 AM IST
నేను విన్నాను... నేను ఉన్నాను... అంటూ నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్... నవరత్నాల హామీల్లో ఒకటైన ఉద్యోగాల భర్తీపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టిన ఆయన... తాజాగా గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి పూనుకున్నారు. ఇందుకు సంబంధించి మార్గదర్శక ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ... జులై 19న ఉత్తర్వును విడుదల చేసింది. గ్రామ సచివాలయాల అవసరం, వాటిలో చేయాల్సిన పనులను అందులో తెలిపింది. 91,652 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐతే... ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 14,098 మాత్రమే. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెడుతూ... అదనంగా 77,554 కొత్త పోస్టుల్ని ఇవ్వబోతోంది.

గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ టైపులో... ఆఫ్ లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేక సిలబస్‌ను గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం రూపొందిస్తున్నట్లు తెలిసింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం 150 మార్కుల పరీక్షను 2 గంటల 30 నిమిషాలపాటూ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని బట్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూలేవీ ఉండవు. 150 మార్కుల పరీక్షలో... 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించినవి, మిగతా 75 జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినవి ఉంటాయి. 18 నుంచీ 42 ఏళ్ల యువకులు వీటికి అప్లై చేసుకోవచ్చని తెలుస్తోంది.

వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించే 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు సిలబస్‌పై ఉంటాయి. మరో 50 జనరల్ నాలెడ్జ్‌పై, మిగతా 50 పర్సనాల్టీ (వ్యక్తిత్వ వికాసం)పై ఉంటాయని తెలిసింది. ఈ ఉద్యోగాలకు నెలకు రూ.15వేలు ఇస్తారని సమాచారం.

ఈ ఉద్యోగాలకు 20 లక్షల మంది పోటీ పడబోతున్నట్లు తెలిసింది. పరీక్షల్లో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తారు. ఆ తర్వాత బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తిలోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో ట్రైనింగ్ ఉంటుంది. అక్టోబర్ 2 నుంచీ ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది.

First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...