హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Exams 2022: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు.. నిబంధనలు ఇవే.. ఒక్క నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ

AP Inter Exams 2022: రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు.. నిబంధనలు ఇవే.. ఒక్క నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ

AP, TS Inter Exams

AP, TS Inter Exams

AP Inter Exams 2022: తెలుగు రాష్గ్రాల్లో పరీక్షల కాలం కొనసాగుతోంది. ఇప్పటికే పది పరీక్షలు కొనసాగుతున్నాయి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఏపీలో పది పరీక్షా పేపర్ల లీకేజ్ వ్యవహారంతో.. ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వానికి ఛాలెంజ్ కానుంది.

ఇంకా చదవండి ...

AP Inter Exams 2022: తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఇంటర్మీడియట్‌ పరీక్షలు (Inter Exams) ప్రారంభం అవుతున్నాయి. కరోనా (Corona) పరిస్థితులు పూర్తిగా సద్దుమణగడంతో.. పరీక్షలకు రెండు రాష్ట్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) , అటు తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్ల (Inter hall tickets)ను ఆయా ఇంటర్‌ బోర్డులు (Inter Board) విడుదల చేశాయి.. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ 24వ తేదీ వరకు.. తెలంగాణలో 23వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటూ విద్యార్థులంతా ఉదయం 8 గంటల 30 నిముషాలలోపే పరీక్షాకేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎప్పటిలాగే.. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులంతా అలర్ట్ అవ్వాల్సి ఉంది. తెల్లవారితేనే ఎగ్జామ్ సెంటర్లకు (Exam Centers) పరుగులు పెట్టడం బెటర్..

ఆంధ్రప్రదేశ్ లోని ఈ ఏడాది ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్, సెకండ్‌ ఇయర్లకు కలిపి మొత్తం 9 లక్షల 14 వేల 423 మంది పరీక్షలు రాయనున్నారు. ఇక వృత్తి విద్య పరీక్షలను 87,435 మంది రాయనున్నారు. ఏపీ వ్యాప్తంగా 1,456 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి : అది విజ్ఞానాన్ని పంచే లైబ్రరీ మాత్రమే కాదు.. ఆహ్లాదం పంచే అద్భుత వనంలో ఉన్న ఫీలింగ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

ఏపీలో సైతం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగినన్ని రోజులూ.. పరీక్ష కేంద్రాలు ఉన్న మార్గాల్లో రెగ్యులర్‌ సర్వీసులు ఏవీ రద్దు చేయకుండా నడపాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల అధికారులకు అదేశాలు అందాయి. ఒకవేళ కనెక్టివిటీ లేని కేంద్రాలకు.. అక్కడి రద్దీ.. విద్యార్ధుల నుంచి విజ్ఞప్తులు వస్తే.. బస్సులు నడపాలని నిర్ణయించారు. ముఖ్యంగా గ్రామాల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చి, మళ్లీ వారిని తిరిగి చేర్చేలా సర్వీసులు ఉండాలని అధికారులకు చెప్పారు.

ఇదీ చదవండి : అది విజ్ఞానాన్ని పంచే లైబ్రరీ మాత్రమే కాదు.. ఆహ్లాదం పంచే అద్భుత వనంలో ఉన్న ఫీలింగ్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

అయితే ఆంధ్రప్రదేశ్ లోని ఇప్పటికే ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీకుల వ్యవహారం తీవ్ర దుమారం లేపుతోంది. ఇప్పటికే ప్రభుత్వం తీరుపై విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ మంత్రి బొత్స పేపర్ లీక్ కాలేదని.. మాస్ కాపీయింగ్ జరగలేదని అంటే.. ముఖ్యమంత్రి మాత్రం.. ఇదంతా కుట్రతో చేస్తున్నారని.. నారాయణ, చైతన్య సంస్థలే పేపర్లు లీక్ చేసి.. దొంగ దొంగా అని అరుస్తున్నాయంటూ మండిపడ్డారు. దీంతో ఇంటర్ పరీక్షల నిర్వహణ సైతం ప్రభుత్వంనాకి ఛాలెంజ్ గా మారింది. మరోవైపు తెలంగాణలో మే 20 నుంచి టెన్త్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

First published:

Tags: Andhra Pradesh, AP Inter Exams 2022, Telangana, TS Inter Exams 2022

ఉత్తమ కథలు