హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP TET-2022 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

AP TET-2022 Results: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET-2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET-2022) ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. ఈ పరీక్షకు మొత్తం 4,07,329 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిందరి మార్కుల వివరాలను https://cse.ap.gov.in/DSE/ వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, PHC, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు అర్హత పరీక్ష మార్కులను నార్మలైజేషన్ పద్ధతి అమలు చేసిన తర్వాత 58.07 శాతం మంది టెట్ లో అర్హత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఏపీ టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 5,25,789 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 150 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఏపీ విద్యాశాఖ. అయితే.. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ టెట్ కు సంబంధించిన ఫలితాలు సెప్టెంబర్ 14న విడుదల కావాల్సి ఉంది.

  ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం నోటిఫికేషన్లు  విడుదలయ్యాయి. మొత్తం 269 ఖాళీలను భర్తీ చేయనన్నట్లు నోటిఫికేషన్లలో(APPSC Job Notifications) లో పేర్కొంది ఏపీపీఎస్సీ. ఇందులో గ్రూప్-4 కింద 6 పోస్టులు, నాన్ గెజిటెడ్ విభాగంలో 45, ఆయుర్వేద లెక్చర్ల విభాగంలో 3, హోమియో లెక్చరర్ల విభాగంలో 34, ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ విభాగంలో మరో 72, హోమియో మెడికల్ ఆఫీసర్ విభాగంలో 53, యునాని మెడికల్ ఆఫీసర్ విభాగంలో 26 ఖాళీలు ఉన్నాయి.

  Jobs 2022: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో 1535 జాబ్స్ .. ఇలా అప్లై చేసుకోండి

  ఏఈఈ విభాగంలో 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలో మరో 7 ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు.ఆ వివరాలను నోటిఫికేషన్లలో చూడొచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. విభాగాల వారీగా నోటిఫికేషన్లను అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్లో చూడొచ్చు. దరఖాస్తులు సైతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు నిర్ణీత తేదీల్లో ఏపీపీఎస్సీ వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Teacher jobs

  ఉత్తమ కథలు