Home /News /jobs /

AP TET 2022 AP TET NOTIFICATION RELEASED TODAY EXAM DATES FEES SYLLABUS ALL THE DETAILS ARE HERE SK

AP TET 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల.. పరీక్షా తేదీలు, ఫీజు సహా పూర్తి వివరాలు ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP TET 2022: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. టెట్ నోటిఫికేషన్ విడుదలయింది. ఆన్‌లైన్ దరఖాస్తులు, ఫీజు, పరీక్షా తేదీలకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

    ఏపీలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. టెట్ (Teacher Eligibility Test) నోటిఫికేషన్ కాసేపటిక్రితమే విడుదలయింది. టెట్ (AP TET 2022) ఆన్‌లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని  http://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో ఉంచారు.  నోటిఫికేషన్ (AP TET Notification), ఇన్ఫర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష సూచనలు వెబ్‌సైట్‌ ద్వా రా తెలుసుకోవచ్చ ని పాఠశాల విద్యాశాఖ  కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ వెల్లడించారు.

    అభ్యర్థులు ఆన్‌లైన్‌లో టెట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తు ఫీజును ఒక్కో పేపర్‌కురూ.500గా నిర్ణయించారు. టెట్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ జూన్ 16 నుంచి ప్రారంభమవుతాయి.  జూన్ 15 నుంచి జులై 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు జులై 16 వరకు గడువు ఉంటుంది.



    ముఖ్యమైన తేదీలు:

    నోటిఫికేషన్ విడుదల: జూన్ 10, 2022

    దరఖాస్తు ఫీజు చెల్లింపునకు గడవు: జూన్ 15 నుంచి జులై 15, 2022 వరకు

    ఆన్‌లైన్ దరఖాస్తులకు గడువు: జూన్ 16 నుంచి జులై 16, 2022 వరకు

    హెల్ప్ డెస్క్ సర్వీస్: జూన్ 13 నుంచి అందుబాటులో ఉంటుంది.

    ఆన్‌లైన్ మాక్ టెస్ట్: జులై 26  నుంచి అందుబాటులో ఉంటుంది.

    హాల్ టికెట్ డౌన్‌లోడ్: జులై 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

    ఎగ్జామ్స్ తేదీలు: ఆగస్టు 6 నుంచి 21 వరకు..

    ప్రాథమిక కీ విడుదల: ఆగస్టు 31, 2022

    ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణకు గడువు: సెప్టెంబరు 1 నుంచి 7 వరకు

    తుది కీ ప్రచురణ తేదీ: సెప్టెంబరు 12, 2022

    తుది పరీక్ష ఫలితాల విడుదల: సెప్టెంబరు 14, 2022

    AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం



    టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది.

    AP TET_2022 నోటిఫికేన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    చాలా రోజులుగా టెట్‌ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP TET 2022, EDUCATION, Govt Jobs 2022, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు