హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP TET 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఏపీలో రేపు టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వివరాలు

AP TET 2022: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఏపీలో రేపు టెట్ నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP TET 2022 | ఏపీలో టెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేప‌థ్యంలో అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి స‌మాచారాన్ని అందిస్తారు.

  ఏపీలో టెట్ నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సం బం ధిం చిన పూర్తి సమాచారం. http://aptet.apcfss.in వెబ్‌సైట్‌ రేపు ఉదయం 10.30 నుం చి అం దుబాటులో ఉం టుం దని వెల్లడిం చారు. నోటిఫికేషన్, ఇన్ఫ ర్మే షన్ బులిటెన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుము, ఆన్లైన్ పరీక్ష (online Exams) సూచనలు వెబ్సైట్ ద్వా రా తెలుసుకోవచ్చ ని కమిషనర్ వెల్లడిం చారు.

  Jobs in AP: నిరుద్యోగుల‌కు అల‌ర్ట్‌.. ఏపీ స్కిల్ డెవ‌లప్‌మెంట్ ద్వారా ఉద్యోగ అవ‌కాశాలు.. ద‌ర‌ఖాస్తు విధానం

  చాలా రోజులుగా టెట్‌ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్‌ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్‌ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్‌ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్‌ ఉత్తీర్ణత సర్టిఫికెట్‌ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్‌సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

  Govt Jobs 2022: డిప్లొమా, ఇంజినీరింగ్ చేసిని వారికి బెస్ట్ చాన్స్.. నెలకు రూ.18,000 వేతనంతో అప్రెంటీస్ జాబ్స్

  వెయిటేజీ వివ‌రాలు..

  రెగ్యులర్‌ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్‌ పోస్టులకు పేపర్‌ 1ఏలో అర్హత సాధించాలి. దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్‌ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్‌ 1బీలో అర్హత తప్పనిసరి. రెగ్యులర్‌ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్‌ 2ఏలో అర్హత సాధించాలి.

  అలాగే స్పెషల్‌ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్‌ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్‌ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

  సెలబస్ వివరాలు.. వెబ్ సైట్లో..

  టెట్‌ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్‌ 1, పేపర్‌ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్‌సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్‌ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Teaching

  ఉత్తమ కథలు