ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను (AP Tenth Exams) నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSEAP) హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు రాష్ట్రంలో 6,10,000 మంది రెగ్యులర్, 55వేల మంది ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నట్లు అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ స్టెప్స్ తో హాల్ టికెట్ల డౌన్ లోడ్:
Step 1: మొదట అధికారిక వెబ్ సైట్ bse.ap.gov.in ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో SSC Public Examinations 2023 - HALL TICKETS లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 4: అనంతరం జిల్లా, స్కూల్ సెలక్ట్ చేయాలి. అనంతరం పేర్ల లిస్ట్ కనిపిస్తుంది. పేరు సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం డేట్ ఆఫ్ బర్త్ నమోద చేయాలి.
Step 5: తర్వాత Download Hall ticket ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
మీ హాల్ టికెట్ హోం స్క్రీన్ పై కనిపిస్తుంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th Class Exams, AP SSC board exams, Career and Courses, Exams, JOBS, Ssc exams