హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Tenth Exams 2023: ఆరు పేపర్లతో అనేక అవస్థలు.. టెన్త్ విద్యార్థులకు కొత్త కష్టాలు.. పూర్తి వివరాలివే

AP Tenth Exams 2023: ఆరు పేపర్లతో అనేక అవస్థలు.. టెన్త్ విద్యార్థులకు కొత్త కష్టాలు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లకు బదులు, 6 పేపర్లను తీసుకు వచ్చారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

పదో తరగతి పరీక్షల్లో (AP Tenth Exams) 11 పేపర్లకు బదులు, 6 పేపర్లను తీసుకు వచ్చారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకే పేపర్లో కొండంత సిలబస్ రాయాల్సి రావడంతో విద్యార్థులకు భారంగా మారింది. గత ఏడాది ఏడు పేపర్లుగా పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది దాన్ని ఆరు పేపర్లకు కుదించారు. ఏప్రిల్ 3 నుంచి ప్రారంభం అయ్యే పదో తరగతి పరీక్షల్లో బిట్ పేపర్ లేకుండా చేశారు. గత ఏడాది పది ఫలితాల్లో లక్షలాది మంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి కూడా పేపర్లు కుదించడమే కారణంగా చెబుతున్నారు. సీబీఎస్ఈలో ఐదు పేపర్లో ఉన్నా అక్కడ విద్యార్థులకు అంతర్గత మార్కులుకూడా ఉంటాయి. ప్రశ్నాపత్రంలో 20 మార్కులకు బిట్లు ఉంటాయి. రాష్ట్ర బోర్డు మాత్రం పదో తరగతి పేపర్లు కుదించి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. సామాన్యం శాస్త్రంలో  ఒక్క పేపరే... గత ఏడాది వరకు ఫిజిక్స్, కెమిస్ట్రీలకు ఒక పేపర్, జువాలజీకి మరో పేపర్ ఉండేది. ప్రస్తుతం సామాన్యశాస్త్రంలో ఒకే పేపర్ ఉంటుంది. జీవశాస్త్రాన్ని కూడా ప్రశ్నాపత్రంలో ప్రత్యేక సెక్షన్ గా విభజించారు.

భౌతిక, రసాయనశాస్త్రాల్లో 12, జీవశాస్త్రంలో 10 అధ్యాయాలున్నాయి. ఇవికాకుండా పర్యావరణ విద్యలో మరో 22పాఠాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకే పేపర్ గా పరీక్ష రాయాల్సి రావడం విద్యార్థులకు కష్టంగా మారింది.

గతంలో ఇంత టెన్షన్ ఉండేది కాదు

గతంలో పదిలో 11 పేపర్లు ఉండేవి. ఏదైనా ఒక పేపర్లో మార్కులు తగ్గితే రెండో పేపర్లో కవర్ చేసుకునే వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. సమాధానాలు రాసేందుకు విద్యార్థులకు 24 పేజీల బుక్ లెట్ ఇస్తారు. అదనంగా అవసరం అయితే 12 పేజీల బుక్ లెట్ ఇస్తారు. సామాన్యశాస్త్రం పరీక్షకు మాత్రం భౌతిక, రసాయన శాస్త్రాల జవాబులు రాసేందుకు 12 పేజీల ప్రత్యేక బుక్ లెట్ ఇస్తారు. జీవశాస్త్రానికి మరో 12 పేజీల బుక్ లెట్ ఇస్తున్నారు.  గత ఏడాది పది పరీక్షలకు ముందే పేపర్లు వాట్సాప్ లలో హల్ చల్ చేశాయి. దీంతో ఈ ఏడాది ఎవరూ పరీక్ష గదుల్లోకి ఫోన్ తీసుకెళ్లకూడదనే నిబంధన విధించారు.

ఎందుకీ ఆరాటం

గతంలో 11 పేపర్ల విధానం ఉన్నప్పుడు పది పరీక్షలు సాఫీగా జరిగేవి. విద్యార్థులకు కూడా అంత టెన్షన్ ఉండేది కాదు. మధ్యలో ఒకటి రెండు సెలవులు కూడా వచ్చేవి. ఏదైనా  ఒక పేపర్ కఠినంగా వస్తే, మరో పేపర్ ఈజీగా ఉండేది. దీంతో విద్యార్థుల పాస్ పర్సెంటేజీ కూడా అధికంగా ఉండేది. కొత్త విధానం విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉండాలి కానీ, ఇలా ఇబ్బందులకు గురించేయడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Career and Courses, Exams, JOBS

ఉత్తమ కథలు