APPSC నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్- ఆర్డినేట్ సర్వీసులో కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు సంబంధించి నవంబర్ 10 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 30 దరఖాస్తులకు చివరితేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య 08
జిల్లాల వారీగా ఖాళీలు..
గుంటూరు - 01
అనంతపురం - 01
కడప - 01
కర్నూలు - 01
నెల్లూరు - 01
చిత్తూరు - 03
మొత్తం - 08
ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబ్-ఆర్డినేట్ సర్వీసులో 8 కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హతలు..
ఎస్‌ఎస్‌సీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్) ట్రేడ్ ఉత్తీర్ణత సాధించి ఉండాిలి.
వయో పరిమితి..
జూలై 01, 2022 నాటికి అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ ఇలా..
రాత పరీక్ష (పేపర్-1, 2), కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (క్వాలిఫైయింగ్ టెస్ట్) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10.11.2022.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2022.
ఫీజు చెల్లింపు చివరి తేది: 04.12.2022.
నోటిఫికేషన్ కు సంబంధించిన PDF ను ఈ లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అటవీ శాఖలో కూడా ఉద్యోగాలు..
AP ఫారెస్ట్ సర్వీసెస్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(Forest Range Officer) పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో క్యారీ ఫార్వర్డ్ పోస్టులు 3, ఫ్రెష్ వేకెన్సీ పోస్టులు 05 ఉన్నాయి. దీనికి సంబంధించి నోటిఫికేషన్ అక్టోబర్ 17, 2022న విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది నవంబర్ 11, 2022 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ డిసెంబర్ 05, 2022గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా డిసెంబర్ 04, 2022గా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: APPSC, Career and Courses, JOBS