Home /News /jobs /

AP SSC RESULTS TO BE DECLARED ON JUNE 6 HERE FULL DETAILS NS

AP SSC Results: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల తేదీ, టైం ప్రకటన.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాజాగా ఫలితాల విడుదలపై డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ (AP SSC Exam Results) కు సంబంధించి విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 3న ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ ఆఖరి నిమిషంలో ఫలితాల విడుదలనను వాయిదా వేసింది. తాజాగా ఫలితాల విడుదలపై డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఫలితాలను రేపు అంటే ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడ ఎంజీ రోడ్ లోని గేట్ వే హోటల్ లో విడుదల చేస్తారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ రిజల్ట్స్ ను అధికారిక వెబ్ సైట్ www.results.bse.ap.gov.in లో చూసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh, AP ssc results, Exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు