AP SSC RESULTS 2022 WILL BE RELEASED SOON STUDENTS CAN CHECK THEIR RESULTS WITH THESE STEPS NS
AP 10th Results 2022: మరికొద్ది సేపట్లో ఏపీ టెన్త్ క్లాస్ ఫలితాలు... ఈ స్టెప్స్‌తో మీ రిజల్ట్ చెక్ చేసుకోండి
నేడే ఏపీ టెన్త్ ఫలితాలు
మరికొన్ని గంటల్లో ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ (AP Tenth Exams) కు సంబంధించిన ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఈ స్టెప్స్ తో తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఎగ్జామ్స్ (AP 10th Exam Results 2022) కు సంబంధించిన ఫలితాలు మరికొన్ని గంటల్లో విడుదల కానున్నాయి. ఈ సారి దాదాపుగా ఆరు లక్షలకు పైగా విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వారంతా గత కొన్ని రోజులుగా ఫలితాల (AP SSC Exam Results 2022) కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెల 4వ తేదీనే ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు, ఆఖరి నిమిషంలో ఫలితాల విడుదలను వాయిదా వేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని తాజాగా విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌తో పాటు News18 Telugu వెబ్సైట్లో కూడా https://telugu.news18.com/ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ టెన్త్ రిజల్ట్స్ కోసం విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1: ముందుగా https://telugu.news18.com/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. Step 2:హోమ్ పేజీలో కనిపించే Andhra Pradesh SSC Results 2022 లింక్ పైన క్లిక్ చేయండి. Step 3:హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. Step 4:ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. Step 5:ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ టెన్త్ ఎగ్జామ్ రిజల్ట్స్‌ని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ లో కూడా చెక్ చేయొచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Step 1: ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. Step 2: హోమ్ పేజీలో టెన్త్ ఎగ్జామ్ ఫలితాల లింక్ పైన క్లిక్ చేయండి. Step 3:హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. Step 4:ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి. Step 5: ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. 6 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. గత రెండేళ్లు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరీక్షలు లేకుండానే విద్యార్థులు టెన్త్ క్లాస్ పాసయ్యారు. ఈసారి బోర్డు పరీక్షలు జరిగాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.