AP SSC RESULTS 2022 EDUCATION MINISTER BOTHSA SATHUANARAYANA WILL RELEASE SSC RESULTS TODAY HERE RESULTS LINK NS
AP SSC Results 2022: ఈ రోజే ఏపీ టెన్త్ ఫలితాలు.. ఈ లింక్ తో నేరుగా రిజల్ట్.. వివరాలివే
నేడే ఏపీ టెన్త్ ఫలితాలు
ఏపీ టెన్త్ పరీక్షల ఫలితాలు (AP Tenth Results) ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో టెన్త్ ఫలితాల విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్సనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు తమ రిజల్ట్స్ ను https://telugu.news18.com/news/career/board-results/ లింక్ ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు. ఇంకా విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ నుంచి కూడా విద్యార్థులు తమ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ నెల 4న ఏపీలో టెన్త్ ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఆఖరి నిమిషంలో అధికారులు ఫలితాల ప్రకటనను వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్లే ఫలితాలు వాయిదా పడ్డాయని తెలుస్తోంది. సాధారణంగా పరీక్షా ఫలితాల (Andhra Pradesh 10th exams results date)ను విద్యాశాఖ మంత్రే విడుదల చేస్తుంటారు.
ఎప్పటి నుంచో ఇది ఆనవాయితీగా వస్తోంది. కానీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Sathyanarayana) ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఫలితాలు ప్రకటించే వేదిక వద్దకు విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎవరూ రాలేదు. ఈ క్రమంలోనే అనేక తర్జనభర్జనల మధ్య.. ఫలితాల ప్రకటనను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 27 నుండి మే 9, 2022 వరకు జరిగాయి. పదోతరగతి పరీక్షలు ఏప్రిల్ 27-తెలుగు, ఏప్రిల్-28-సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 29-ఇంగ్లిష్, మే 2-గణితం, మే 4-సైన్స్-4, మే 5-సైన్స్ పేపర్-2, మే 6న సోషల్ పరీక్షలు నిర్వహించారు. ఈ సారి ఏపీలో పదో తరగతి పరీక్షల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.
మొత్తం 6 లక్షల 2 1వేల 799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. ఫిజికల్ సైన్స్, బయోలజికల్ సైన్స్ 50 మార్కుల చొప్పున.. మిగతా అన్ని పరీక్షలు 100 మార్కులకు నిర్వహించారు. ఈసారి గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ఫలితాలు ప్రకటించనున్నారు.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.