AP SSC Results 2019: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల... బాలికలదే పైచేయి

AP SSC Results 2019 | మొత్తం 94.88 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలదే పైచేయి. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68.

news18-telugu
Updated: May 14, 2019, 11:38 AM IST
AP SSC Results 2019: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల... బాలికలదే పైచేయి
AP SSC Results 2019: ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం, image: PTI)
news18-telugu
Updated: May 14, 2019, 11:38 AM IST
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి. తెలంగాణలో టెన్త్ రిజల్ట్స్ ప్రకటించిన మరుసటిరోజే ఏపీలో కూడా పదో తరగతి పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.88. ఏపీ టెన్త్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించడం విశేషం. బాలికల ఉత్తీర్ణత శాతం 95.09 కాగా, బాలుర ఉత్తీర్ణతా శాతం 94.68. ఏపీ టెన్త్ ఫలితాల్లో 98.19 శాతంతో మొదటి స్థానంలో తూర్పు గోదావరి జిల్లా నిలవగా, చివరి స్థానంలో 83.19 శాతంతో నెల్లూరు జిల్లా ఉంది. ఫలితాలను ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్స్ www.bseap.org, www.rtgs.ap.gov.in తో పాటు telugu.news18.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.


AP SSC Results 2019: చెక్ చేసుకోండి ఇలా



ముందుగా www.bseap.org లేదా www.rtgs.ap.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
పదో తరగతి పరీక్షా ఫలితాల లింక్‌పైన క్లిక్ చేయండి.


మీ రోల్ నెంబర్, ఇతర వివరాలు నమోదు చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి.
ఎస్ఎస్‌సీ ఫలితాలు కనిపిస్తాయి.
ఫలితాలను ప్రింట్ తీసి కాపీ దగ్గర పెట్టుకోండి.
ఫలితాలను https://telugu.news18.com/ వెబ్‌సైట్‌లో నేరుగా చూడొచ్చు.

ఫైబర్ నెట్ కనెక్షన్ ఉన్నవారు విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫలితాలను నేరుగా స్క్రీన్ పైన చూడొచ్చు. దాంతో పాటు పీపుల్స్ ఫస్ట్, ఖైజాలా యాప్స్‌లోనూ ఏపీ టెన్త్ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్స్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగాయి. మొత్తం 6,32,898 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 6,30,082 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 6,19,494 మంది రెగ్యులర్ విద్యార్థులు, 10,588 ప్రైవేట్ విద్యార్థులు. 5464 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించగా, 3 స్కూళ్లలో ఉత్తీర్ణత సున్నా శాతం.

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి


ఇవి కూడా చదవండి:

Career After 10th: టెన్త్ పాసైనవారు చేయాల్సిన కోర్సులివే...

Jobs After 10th: టెన్త్ పాసయ్యారా? ఉద్యోగావకాశాలు ఇవే...
First published: May 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...