Home /News /jobs /

AP SSC HINDI MODEL PAPER 1 SPECIAL MODEL PAPER FOR AP TENTH STUDENTS DOWNLOAD GNT EVK

AP SSC Hindi Model Paper-1: హిందీ ప‌రీక్షలో ఏం వ‌స్తాయి.. ఏపీ టెన్త్ స్టూడెంట్స్ కోసం ప్ర‌త్యేక‌ మోడల్ పేపర్.. డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

AP SSC Hindi Model Paper-1 | క‌రోనా కార‌ణంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి కోవిడ్ కారణంగా పదో తరగతి హిందీ సిలబస్‌లో 75 శాతం సిలబస్ ను మాత్రం మే పరిగణలోకి తీసుకొని పరీక్షా పత్రం సిద్ధం చేసింది. ఈ నేప‌థ్యంలో ప‌రీక్ష‌లో ఏం వ‌స్తాయి.. మోడ‌ల్ పేప‌ర్ విద్యార్థుల కోసం

ఇంకా చదవండి ...
    సేకరణ: అన్నారఘు, అమరావతి
    రచయిత: శ్రీదేవి, హిందీ ఉపాధ్యాయురాలు, నకిరికల్లు, గుంటూరు జిల్లా 

    కరోనా (Corona)  విద్యార్థులను పాఠశాలకు దూరం చేసి సాంకేతికత తో ఆన్లైన్ చదువులుగా మార్చేసింది. ఐతే పిల్లలకు ఆన్లైన్ బోధనలో పిల్లలు నాణ్యత గల చదువును అభ్యసిస్తున్నారా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మిగిలింది. అయితే పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సారి కోవిడ్ కారణంగా పదో తరగతి హిందీ సిలబస్‌లో 75 శాతం సిలబస్ ను మాత్రం మే పరిగణలోకి తీసుకొని పరీక్షా పత్రం సిద్ధం చేసిందని గుంటూరు జిల్లా నకిరికల్లు జిల్లా పరిషత్ పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు శ్రీదేవి  గారు తెలియ చేశారు.

    పదహారు పాఠాలకు గాను నాలుగు పాఠాలను తొలగించి పన్నెండు పాఠాల సిలబస్‌ను పరిగణలోకి తీసుకొని పరీక్షా పత్రాల (Exam Papers) ను సిద్ధం చేసారు. .గతం లో 80 మార్కులకు పరీక్షా పత్రం ఉండేది. ఇరవై మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉండేవి. ఐతే ఈ ఏడాది వంద మార్కులకు పరీక్షా పత్రం సిద్ధం చేసారు.

    - మొదటి భాగంలో వ్యాకరణానికి సంబంధించి చిన్న జవాబుల ప్రశ్నలు పన్నెండు ప్రశ్నలు ఒక్కొక్క దానికి ఒక మార్క్ నిర్ణయించబడినది.ఉదాహరణకు 1. गुरुकी कृपा अपार है (रेखांकित शब्द का तद्बाव रूप पहचानिए) వంటి ప్రశ్నలు ఉంటాయి

    - రెండవ భాగం లో నాలుగు ప్రశ్నలు ఉంటాయి. దీని లో వ్యాసం ఇచ్చి ప్రశ్నలకు వ్యాసంలో నుండి జవాబుల రాయవలసి ఉంటుంది. వాటిలో ఒక ప్రశ్న వ్యాకరణానికి సంబంధించి ఉంటుంది. మరొకటి పాఠ్యపుస్తకంలో నుండి మరొక రెండు ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ఉంటాయి.

    - మూడవ భాగం లో రెండు ప్రశ్నలు ఒక్కొక్క దానికి నాలుగు మార్కులాగా పాఠ్య పుస్తకం లోని పాఠ్యంశాలకు సంబంధించి ప్రశ్నల కి జవాబు వ్రాయాలి.

    - నాల్గవ భాగం లో ఎనిమిది ప్రశ్నలు ఒక్కొక్క దానికి మూడు మార్కులాగా పాఠ్య పుస్తకం లోని పాఠ్యంశలకు సంబంధించి ప్రశ్నల కి జవాబు వ్రాయాలి.

    - ఐదవ భాగం లో పద్య,గద్య భాగమునకు సంబంధించిన రెండు ప్రశ్నలు ఉంటాయి .ప్రతి ప్రశ్న కు ఒక ఆప్షన్ ఉంటుంది వాటిలో ఒక ప్రశ్న కి జవాబు వ్రాయాలి ఆలా రెండు ప్రశ్నల కు జవాబు వ్రాయవలసి ఉంటుంది.

    - ఆరవ భాగం లో వివిధ సందర్భాలలో జాబు ఎలా వ్రాస్తారో ఆలా ఒక అంశానికి సంబంధించి జాబు వ్రాయవలసి ఉంటుంది. దీనిలో కూడా ఆప్షన్ ఉంటుంది ఇచ్చిన రెండిటి లో ఒక దానికి వ్రాయాలి. రెండవ ప్రశ్న సామజిక సంఘటనలు లేదా ప్రముఖ కార్యక్రమాల గురించి వ్యాసం వ్రాయవలెను. వీటిలో కూడా ఆప్షన్ ఉంటుంది రెండింటిలో ఒకదానికి జవాబు వ్రాయవలెను ఒక్కొక్క ప్రశ్నకు ఎనిమిది మార్కులుగా నిర్ణయించారు.



    మొత్తం మీద పదవ తరగతి ప్రశ్నాపత్రం ఈ విధంగా ఉండబోతుంది. విద్యార్థులు ఎప్పటికప్పుడు శ్రమించి హిందీ వ్యాకరణం, సామజిక పరిస్థితుల పై అవగాహన లెటర్ రైటింగ్ ల పై ద్రుష్టి పెట్టి చదివితే చాలా మేలు జరుగుతుంది. మంచి మార్కులు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: 10th Class Exams, Andhra Pradesh, AP 10th Exams 2022, AP SSC board exams

    తదుపరి వార్తలు