Home /News /jobs /

AP SSC EXAMS CANCELLED ANNOUNCED AP EDUCATION MINISTER ADIMULAPU SURESH AK

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది.

    పదో తరగతి పరీక్షల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో రకంగా కరోనా వ్యాప్తించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం... పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్షలు రాసేందుకు వెళ్లే తమ బిడ్దల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులు బాధపడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులతో మాత్రమే జరగదని... ఇతర శాఖలు కూడా ఇందుకోసం పని చేయాలని అన్నారు.

    రాష్ట్రంలో రోజురోజుకు కంటైన్’మెంట్ జోన్లు పెరుగుతుండటం కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయడానికి కారణమని ప్రభుత్వం వెల్లడించింది. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తామని మంత్రి సురేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. పదో తరగతి పరీక్షలతో పాటు ఇంటర్మీడియట్, ఫస్ట్, సెకండ్ ఇయర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం... పరీక్షలు రాయబోయే విద్యార్థులందరినీ పాస్ చేయబోతున్నట్టు తెలిపారు.

    అంతకుముందు ఏపీలో రోజు రోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తుండటం... నిత్యం 400కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి తోడు ప్రభుత్వం తీరుపై జనసేన, టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని.. టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలపై సీఎం జగన్‌తో చర్చించిన విద్యాశాఖ.. పదో తరగతితో పాటు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించింది.
    First published:

    Tags: Andhra Pradesh, Ssc exams

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు