Home /News /jobs /

AP SKILL HAS CONDUCTING SKILL CONNECT DRIVE AT NATIONAL ACADEMY OF CONSTRUCTION HERE DETAILS NS

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు మరో భారీ జాబ్ మేళా.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రేపు భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నెల 3న అంటే.. జూన్ 3న మరో భారీ జాబ్ మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రముఖ Apollo Pharmacy, TCL సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ (Job Registration) చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 3న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    Apollo Pharmacy: ఈ సంస్థలో 102 ఖాళీలు ఉన్నాయి. బీ/డీ/ఎం ఫార్మసీ, టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
    TCL: ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు రేణిగుంటలో పని చేయాల్సి ఉంటుంది.

    ఇతర వివరాలు:
    -అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. -రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 3న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో&ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.



    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9618655759, 9603770097 నంబర్లను సంప్రదించాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూలను నిర్వహించనున్న చిరునామా: National Academy of Construcion (NAC), Near Govt. Junior College, Rayachoty Road, Rajampet - Annamayya District
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, Job notification, Private Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు