ఏపీలో నేడు సచివాలయ వీఆర్వో, సర్వే అసిస్టెంట్ పరీక్షలు..

నేడు కేటగిరీ-2 (గ్రూప్-బి) లోని వీఆర్వో (గ్రేడ్-2), సర్వే అసిస్టెంట్ (విలేజ్ సర్వేయర్: గ్రేడ్-3) పోస్టులకు.. కేటగిరీ-3లోని ఏఎన్‌ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 3, 2019, 8:08 AM IST
ఏపీలో నేడు సచివాలయ వీఆర్వో, సర్వే అసిస్టెంట్ పరీక్షలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో సచివాలయాల పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 1న రాత పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. 1న కేటగిరీ-1లోని మొత్తం పోస్టులకు, కేటగిరీ-3లోని పంచాయతీ కార్యదర్శి (గ్రేడ్-6) డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించగా, నేడు కేటగిరీ-2 (గ్రూప్-బి) లోని వీఆర్వో (గ్రేడ్-2), సర్వే అసిస్టెంట్ (విలేజ్ సర్వేయర్: గ్రేడ్-3) పోస్టులకు.. కేటగిరీ-3లోని ఏఎన్‌ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వో పరీక్షకు 402 పరీక్షా కేంద్రాలను, ఏఎన్‌ఎం పరీక్షకు 148 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం సెషన్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వీఆర్వో, సర్వే అసిస్టెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సెషన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏఎన్‌ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించనున్నారు.

27,578 పోస్టుల్లో వీఆర్వో-2880 పోస్టులు, విలేజ్ సర్వేయర్-11,158 పోస్టులు, ఏఎన్‌ఎం/వార్డ్ హెల్త్ సెక్రటరీ (గ్రేడ్-3)-11,158 పోస్టులకు సంబంధించి రాతపరీక్ష నిర్వహించనున్నారు. కాగా, ఈ పరీక్షలకు అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ సూచించారు.
First published: September 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading