AP POLYCET 2022 | విద్యార్థులు ఎదురు చేస్తున్న ఏపీ పాలిసెట్ ఫలితాలు ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. ఈసారి 91.84 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. పాలీసెట్-2022 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. ఇందులో 1,20,866 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాలు చెక్ చేసుకొనే విధానం..
- అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/Default.aspx ను సందర్శించాలి.
- ఫలితాల లింక్‌లోకి వెళ్లి మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి.
- ఫలితాలు కనిపిస్తాయి. విద్యార్థులు ఫలితాల కాపీనీ డౌన్‌లోడ్ చేసుకొని భద్ర పరుచుకోవాలి.
ర్యాంక్ కేటాయింపు వివరాలు..
- ఒకవేళ అర్హత మార్కులలో ఎవరికైనా సమానంగా మార్కులు వస్తే ఎలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి... మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Polytechnic colleges, Results