AP POLYCET 2022 RESULTS POLICET RESULTS TODAY KNOW RANKING SYSTEM PROCESS EVK
AP POLYCET 2022 Results: నేడు పాలిసెట్ ఫలితాలు.. ర్యాంక్‌లు ఎలా కేటాయిస్తారంటే..
ప్రతీకాత్మక చిత్రం
AP POLYCET 2022 Results | విద్యార్థులు ఎదురు చేస్తున్న ఏపీ పాలిసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 9:15 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేయనున్నారు.
విద్యార్థులు ఎదురు చేస్తున్న ఏపీ పాలిసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలను ఉదయం 9:15 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేయనున్నారు. పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (SBTET) నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుదల చేసింది. ఈ ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును.
ర్యాంక్ కేటాయింపు వివరాలు..
- ఒకవేళ అర్హత మార్కులలో ఎవరికైనా సమానంగా మార్కులు వస్తే ఎలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి... మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును అధికారిక వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
1.25 లక్షల మంది విద్యార్థులు..
పాలీసెట్-2022 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. పరీక్ష పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంక్‌ను కేటాయిస్తారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.