ఆంధ్రప్రదేశ్ లో 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సైతం ఇప్పటికే పూర్తి కాగా.. ఫిజికల్ ఈవెంట్స్ ను ఈ నెల 14 నుంచి నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే.. ఈ ఈవెంట్స్ ను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈవెంట్స్ ను వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు కోరడంతో ఈ నిర్ణయం తీసుకుంది రిక్రూట్మెంట్ బోర్డ్. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.