ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పోలీస్ ఉద్యోగాల (AP Police Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 411 ఎస్సై, 6100 కానిస్టేబుల్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇప్పటికే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగియగా.. జనవరి 22న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక ఎస్సై పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 12, 2022న ప్రారంభం అయ్యాయి. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 18, 2023. అంటే ఈరోజుతో ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. దరఖాస్తులు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలిలా..
సివిల్ సబ్ ఇన్ స్పెక్టర్ పోస్టులు (మెన్ అండ్ ఉమెన్) - 315
ఏపీఎస్పీ రిజర్వ్ ఎస్సై పోస్టులు - 96
మొత్తం ఎస్సై పోస్టుల సంఖ్య - 411.
ముఖ్యమైన తేదీలు..
ఎస్సై పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం - డిసెంబర్ 12, 2022
ఎస్సై పోస్టులకు దరఖాస్తుల చివరి తేదీ - జనవరి 18, 2023
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు..
ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష - ఫిబ్రవరి 19, 2023
ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్స్ విడుదల తేదీ - ఫిబ్రవరి 02, 2023
(పేపర్ 1 ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు..
పేపర్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు )
ఎస్సై పరీక్ష మొదటి పేపర్ లో రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ నుంచి 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
సెకండ్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ లో జనరల్ స్టడీస్ పేపర్ 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు.
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ- జనవరి 22, 2023 న నిర్వహించనున్న విషయం తెలిసిందే.
కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. వీటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి స్థాయి పరీక్షకు అర్హులుగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ ఫిజికల్ టెస్టుల్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏపీ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అనుమతిస్తారు. ఇది మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు కలిగి ఉన్న పరీక్ష. దీనిలో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
శారీరక సామర్థ్య పరీక్షలు..
ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారు దేహదారుడ్య పరీక్షలకు హాజరవ్వాల్సి ఉంటుంది. దీనిలో.. సివిల్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్ ఉంటుంది. ఇవి కేవలం అర్హత కోసం మాత్రమే. వీటిలో ఎలాంటి మెరిట్ ఉండదు. ఇక ఏపీఎస్పీ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు 1600 మీ, 100 మీ, లాంగ్ జంప్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అంతే కాకుండా.. వీటిలో మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉండనుంది.
దరఖాస్తు ఫీజు..
జనరల్, బీసీ అభ్యర్థులు 300 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో ఏమైనా సమస్యలు ఏర్పడినా.. సందేహాలు ఉన్నా.. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపు 9441450639 నంబర్ ను సంప్రదించవచ్చు.
ఎస్సై మెయిన్స్ పరీక్ష ఇలా..
ఎస్సై మెయిన్స్ పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 అండ్ 2 అర్హత పరీక్షలు కాగా.. పేపర్ 3 లో 100 మార్కులు, పేపర్ 4 లో 100 మార్కలు కేటాయించారు. అంతే కాకుండా.. పీఈటీలో 100 మార్కులు ఉంటాయి. వీటిలో సాధించిన మెరిట్ అధారంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష ఇలా..
కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 3 గంటలు. ప్రధాన పరీక్షలో ఇంగ్లిస్, అరిథ్‌మెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ,పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, రీజనింగ్,మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, Ap police jobs, JOBS, State Government Jobs