ఆంధ్రప్రదేల్ 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు (AP Constable Jobs) సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను అధికారులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా.. 4,58,219 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో కేవలం 95,208 మంది మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. వీరికి ఈవెంట్స్ నిర్వహించి.. అందులో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. జనవరి 22న ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSRB). రాష్ట్రంలోని 33 ప్రాంతాల్లోని 997 పరీక్షా కేంద్రాల్లో ఈ ఎగ్జామ్ ను నిర్వహించారు. పరీక్ష నిర్వహించిన కేవలం 15 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసి సంచలనం సృష్టించింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
మొత్తం 200 మార్కులకు ఈ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించగా.. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్ మెన్ కు 30 శాతం (60 మార్కులు), బీసీ అభ్యర్థులకు 35 శాతం (70 మార్కులు), ఓసీ అభ్యర్థులకు 40 శాతం (80 మార్కులు) అర్హతగా నిర్ణయించి ఫలితాలను విడుదల చేశారు.
BSF Recruitment: పది, ఇంటర్ అర్హతతో.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) నోటిఫికేషన్ జారీ..
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
Step 1: అభ్యర్థులు ముందుగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్ సైట్ https://slprb.ap.gov.in/ ను ఓపెన్ చేయాలి.
Step 2: హెం పేజీలో CT PC PWT Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3: రిజల్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
Step 4: ఫలితాలు హోం స్క్రీన్ పై కనిపిస్తాయి.
పరీక్షను నిర్వహించిన రోజే ప్రాథమిక జవాబు పత్రాన్ని సైతం రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఈ కీపై మొత్తం 2261 అభ్యంతరాలు రాగా.. నిపుణుల సూచనల మేరకు 3 ప్రశ్నల జవాబులను మార్చారు. స్కానింగ్ ఓఎంఆర్ షీట్లను ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.
రెండో దశ అప్లికేషన్లను ఫిబ్రవరి 13వ తేదీ సాయంత్రం 3 గంటలకు ప్రారంభించనున్నట్లు తెలిపింది రిక్రూట్మెంట్ బోర్డ్. అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే తదుపరి దశ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ఏమైనా సందేహాలుంటే 9441450639, 9100203323 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. లేదా mail-slprb@ap.gov.in మెయిల్ ద్వారా కూడా తెలియపరవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.