ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (APSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. 6100 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు ఈ లింక్ slprb.ap.gov.in ద్వారా తమ హాల్ టికెట్లను నేరుగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. ఏపీలో 6100 కానిస్టేబుల్ (CIVIL&APSP) ఉద్యోగాల భర్తీకి ఇటీవల పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది బోర్డు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.
మొత్తం 200 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఈ వెంట్స్ లో అర్హత సాధించిన వారికి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామ్ లో అభ్యర్థులు సాధించిన మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్ లోడ్ ఇలా..
Step 1: అభ్యర్థులు మొదటగా slprb.ap.gov.in ఈ లింక్ ను ఓపెన్ చేయాలి.
Step 2: హోం పేజీలో Download Hall Ticket for SCT PC (Civil and APSP) లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: అప్పుడు హాల్ టికెట్ డౌన్ లోడ్ అవుతుంది. ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Government Jobs, JOBS, State Government Jobs