AP Inter Results 2020 | https://bie.ap.gov.in/ | ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రిలీజ్... చెక్

Manabadi Inter result 2020 | ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది.

news18-telugu
Updated: June 12, 2020, 5:00 PM IST
AP Inter Results 2020 | https://bie.ap.gov.in/ | ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు రిలీజ్... చెక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
AP Inter 1st Year results | AP Inter 2nd Year results | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్  ఫలితాలను విడుదల చేశారు. 2019-20  విద్యా సంవత్సరానికి సంబంధించి దేశంలో ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ఇంటర్ ఫలితాలను ప్రకటించలేదు. ఏపీనే తొలి రాష్ట్రంగా నిలిచిపోతుందని అధికారులు చెప్పారు. ఈ సంవత్సరం 5,07,230 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇక 4,35,653 మంది రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలను రాశారు. ఇంటర్ ఫలితాలపై కాలేజీలు ఎలాంటి ప్రకటనలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో జారీ చేయకూడదని బోర్డు అధికారులు ఆదేశాలు ఇచ్చారు.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 5,07,230 మంది పరీక్షలు హాజరయ్యారు. అందులో 300,560 మంది పాస్ అయ్యారు. అంటే 59 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు. ఇక ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,35,653 మంది హాజరయ్యారు. అందులో 2,76,389 మంది పాస్ అయ్యారు. అంటే, 63 శాతం ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల్లో బాలికలు సత్తా చాటారు. మొదటి సంవత్సరంలో 2,57,619 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,64,365 ఉత్తీర్ణత సాధించారు. అంటే, 64 శాతం పాస్ అయినట్టు. మొదటి సంవత్సరం బాలుర విషయానికి వస్తే 2,49,611 మంది పరీక్షకు హాజరయ్యారు. అందులో పాస్ అయిన వారి సంఖ్య 1,36,196. అంటే 55 శాతం ఉత్తీర్ణత సాధించారు.





ఇక రెండో సంవత్సరంలో కూడా బాలికలే పై చేయి సాధించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 2,22,798 హాజరు కాగా, 1,49,010 పాస్ అయ్యారు. 67 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. అదే బాలుర విషయానికి వస్తే సెకండియర్లో 2,12,857 మంది పరీక్షలకు హాజరుకాగా, అందులో 1,27,379 మంది పాస్ అయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు.

ఏపీలో 10.64 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 1,411 సెంటర్లలో పరీక్షలు రాశారు. ఈ ఏడాది మార్చి 5 నుంచి పరీక్షలను నిర్వహించారు. చివరి పరీక్షకు ముందు మార్చి 25 నుంచి దేశంలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో జూన్ 3న చివరి పరీక్ష నిర్వహించారు. మార్చి 19 నుంచి వాల్యుయేషన్ ప్రారంభించినా, లాక్ డౌన్ కారణంగా  కాస్త ఆలస్యం అయ్యింది. వాల్యుయేషన్ సమయంలో చాలా కేర్ తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. లాక్ డౌన్ అమలు సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాల్యువేషన్ నిర్వహించిన అధికారులు ఫలితాలు రిలీజ్ చేశారు. ఈసారి ఫలితాలను ఫస్ట్ టౌమ్ క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేశారు. మార్కుల మెమోలు 15వ తేదీ నుంచి https://bie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
First published: June 12, 2020, 4:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading