Home /News /jobs /

AP JOBS CONTRACT JOBS IN HEALTH MEDICAL AND FAMILY WELFARE SALARY RS 80000 KNO ELIGIBILITY AND APPLICATION PROCESS EVK

Jobs in Andhra Pradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేత‌నం రూ. 80,000.. అర్హ‌త‌లు, ద‌ర‌ఖాస్తు విధానం

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Jobs in Andhra Pradesh | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ) ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకోసం శాఖ ప‌ర‌మైన నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) ప్ర‌భుత్వ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ వైద్య విధాన ప‌రిష‌త్ (ఏపీవీవీపీ) ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న ప‌లు పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందుకోసం శాఖ ప‌ర‌మైన నోటిఫికేష‌న్ (Notification)  విడుద‌ల చేశారు. ఈ నోటిఫికేష‌న్ ద్వారా హాస్ప‌ట‌ల్ అడ్మినిస్ట్రేట‌ర్ (Hospital Administrator)  పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనే అభ్య‌ర్థుల వ‌య‌సు 42 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు. ద‌ర‌ఖాస్తు విధానం, నోటిఫికేష‌న్ స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://hmfw.ap.gov.in/index.aspx ను సంద‌ర్శించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవకాశం ఉంది.

    Indian Army Jobs 2022: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఇండియ‌న్ ఆర్మీలో ఉద్యోగ అవ‌కాశాలు

    పోస్టుల వివరాలు..















    పోస్టు పేరుఅర్హతలుఖాళీలువేతనం
    స్ప‌ట‌ల్ అడ్మినిస్ట్రేట‌ర్ఎంబీబీఎస్‌, మాస్ట‌ర్ డిగ్రీ, (హాస్ప‌ట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్/ హాస్ప‌ట‌ల్ మేనేజ్‌మెంట్) సంబంధిత విభాగాల్లో ఎంబీఏ ఉత్తీర్ణ‌త ఉండాలి. పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్) అభ్య‌ర్థుల‌కు మొద‌టి ప్రాధాన్యం ఇస్తారు. పీజీ డిప్లమా/ డీఎన్‌బీ అభ్య‌ర్థుల‌కు రెండో ప్రాధాన్య‌మిస్తారు. సంబంధిత ప‌నిలో అనుభ‌వంతోపాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. టెక్నిక‌ల్ సామ‌ర్థ్యం ఉండాలి.49రూ. 80,000

    Govt Job Preparation: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రిప‌రేష‌న్ టిప్స్‌, ప‌రీక్ష విధానం!

    ఎంపిక విధానం..
    - ముందుగా అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.
    - ఎంబీబీఎస్‌, పీజీ, డిప్ల‌మా మార్కులు, మాస్ట‌ర్స్ డిగ్రీల‌లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
    - షార్ట్ లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి తుది ఎంపిక చేస్తారు.

    Jobs in Andhra Pradesh: ప్ర‌కాశం జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు.. వేతనం రూ. 17,500, అర్హ‌త‌లు, అప్లికేష‌న్ ప్రాసెస్‌



    Govt Job Preparation: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ప్రిప‌రేష‌న్ టిప్స్‌, ప‌రీక్ష విధానం!

    ద‌ర‌ఖాస్తు విధానం..

    Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.

    Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://hmfw.ap.gov.in/index.aspx ను సంద‌ర్శించాలి.

    Step 3 - నోటిఫికేష‌న్‌ను పూర్తిగా చ‌ద‌వాలి.

    Step 4 - ఆన్‌లైన్ అప్లికేష‌న్ కోసం https://dmeaponline.com/ లింక్‌లోకి వెళ్లాలి

    Step 5 - గ‌తంలో రిజ‌స్ట‌ర్ అయిన వారు నేరుగా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

    Step 6 - కొత్త రిజిస్ట‌ర్ అయ్యే వారు Register Here లింక్‌లోకి వెళ్లి రిజిస్ట‌ర్ చేసుకొని ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

    Step 7 - ద‌ర‌ఖాస్తుకు మార్చ్ 15, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra Pradesh Government Jobs, Govt Jobs 2022, Health department jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు