Home /News /jobs /

AP JOBS APSSDC INVITING APPLICATIONS FOR VARIOUS JOB VACANCIES HERE APPLICATION LINK NS

AP Jobs: ఏపీలో డిగ్రీ అర్హతతో జాబ్స్.. దరఖాస్తుకు కొన్ని గంటలే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి చాలా రోజుల తర్వాత ప్రైవేట్ ఉద్యోగాల (Private Jobs) భర్తీకి సంబంధించి ప్రకటన విడుదలైంది. ప్రముఖ HETERO సంస్థలో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన విడుదల చేశారు అధికారులు. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ప్రొడక్షన్ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.93 లక్షల వేతనం చెల్లించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 21ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    బీఎస్సీ కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే కేవలం ఫ్రెషర్స్ మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. దరఖాస్తు దారుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    AP Anganwadi Jobs: ఏపీలో టెన్త్ పాసైన మహిళలకు అలర్ట్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో 3 రోజులే ఛాన్స్



    ఇతర వివరాలు:
    అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది.
    ఎంపికైన వారికి వేతనంతో పాటు ప్రొడక్షన్ బోనస్ గా రూ.500, అటెండెన్స్ బోనస్ గా రూ.1000, నైట్ షిఫ్ట్ అలవెన్స్ కింద రూ.1000-రూ.2000 అందిస్తారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు