Home /News /jobs /

AP JOBS APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT DECCAN FINE CHEMICALS HERE REGISTRATION LINK NS

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ, డిప్లొమా అర్హతతో డెక్కన్ కెమికల్స్ తో జాబ్స్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Deccan Fine Chemicals India Pvt Ltd సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela) కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ Deccan Fine Chemicals India Pvt Ltd సంస్థలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్లో రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 15న జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఈ నియామకాలను చేపట్టనున్నారు. మొత్తం 200 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), డిప్లొమా (కెమిస్ట్రీ) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్ల మధ్యలో ఉండాలి. అభ్యర్థులు 2017-2019 మధ్యలో పాసై ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,976 నుంచి రూ.15,418 వరకు వేతనం చెల్లించనున్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు తునిలోని సంస్థ ప్రాంగణంలో పని చేయాల్సి ఉంటుంది.
    Investments in Telangana: తెలంగాణకు రూ.24 వేల కోట్ల భారీ పెట్టుబడులు.. ఇది హిస్టారిక్ డే అన్న కేటీఆర్.. ఎంతమందికి ఉద్యోగాలంటే?



    ఇతర వివరాలు:
    - అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://www.apssdc.in/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 15న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కవాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూలు నిర్వహించనున్న చిరునామా: KBR Degree College, Yalamanchili, Anakapalli District చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    - అభ్యర్థులు ఆధార్ జిరాక్స్ ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాల కోసం 7036363272 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job notification, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు