Home /News /jobs /

AP JOBS 2022 NOTIFICATION RELEASED FOR VARIOUS JOB VACANCIES AT VIJAYAWADA GOVERNMENT HOSPITAL HERE APPLICATION PROCESS NS

AP Jobs 2022: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీలోని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగాల భర్తీకి అధికారులు జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన ఖాళీలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల (Jobs) భర్తీకి ఆయా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా విజయవాడలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అయితే ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీల వివరాలు:
































    డార్క్ రూం అసిస్టెంట్:01
    ఈసీజీ టెక్నీషియన్లు:02
    స్పీచ్ థెరపిస్టు:01
    ఎంఆర్ఐ టెక్నీషియన్లు03
    సిటీ టెక్నీషియన్లు02
    డయాలసిస్ టెక్నీషియిన్01
    మొత్తం:10

    విద్యార్హతల వివరాలు:
    వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో డిప్లొమా/బీఎస్సీ, ఈసీజీ టెక్నీషయన్ కోర్సు, బ్యాచలర్ డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలను కింద అటాచ్ చేసిన నోటిఫికేషన్లో చూడొచ్చు.
    After 10th Class: ‘పది’ తర్వాత దారెటు..? ఉద్యోగమే మీ లక్ష్యం అయితే వీటిని పరిశీలించండి..




    ఎలా అప్లై చేయాలంటే..
    Step 1: అభ్యర్థులు ముందుగా కృష్ణా జిల్లా అధికారిక వెబ్ సైట్ (https://krishna.ap.gov.in/) ఓపెన్ చేయాలి.
    Step 2: అనంతరం Notices విభాగంలో Recruitment ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    అనంతరం Application లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 3: అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
    Step 4: డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ను నింపి office of the Superintendent, Government General Hospital Vijayawada చిరునామాలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందించాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Andhra Pradesh Government Jobs, Job notification, JOBS, State Government Jobs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు