ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది APSSDC. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్టర్ (APSSDC Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా Mohan Spintex India Pvt Ltdతో పాటు Apollo Pharmacy సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
Mohan Spintex India Pvt Ltd: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. స్పిన్నింగ్ ఆపరేటర్స్, ప్రాసెసింగ్ ఆపరేటర్స్, టైలర్స్, ప్యాకర్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఏడో తరగతి నుంచి ఇంటర్, ఐటీఐ, డిప్లొమా విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు నూజివీడులో పని చేయాల్సి ఉంటుంది.
Job Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ మీకోసం..
Apollo Pharmacy: ఈ సంస్థలో 80 ఖాళీలు ఉన్నాయి. ఫార్మసిస్ట్/అసిస్టెంట్ ఫార్మసిస్ట్/రిటైల్ ట్రైనీ అసోసియేట్/ఆడిటర్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎం/బీ/డీ ఫార్మసి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం ఉంటుంది. ఎంపికైన వారు ఏలూరు , వెస్ట్ గోదావరి జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది.
@AP_Skill has Collaborated with #MohanSpintexIndia and @ApolloPharmacy to Conduct Mini Job Drive at #EluruDistrict
For more details on eligibility visit https://t.co/qvHSItiHqO Contact: Mr. Rama Krishna - 96525 03799 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/kT3JF1nQaC — AP Skill Development (@AP_Skill) October 10, 2022
ఇతర వివరాలు:
- అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9652503799 నంబర్ ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు.
ఇంటర్వ్యూలను నిర్వహించే చిరునామా: CHSD St.Theresa(A) College Fow Woman, Near MP-Office, Gavaravaram, Sanivapupeta Road, Eluru-Eluru District.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job Mela, JOBS, Private Jobs