హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. రేపు జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న మినీ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kakinada, India

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 17న మినీ జాబ్ మేళాను (Job Mela) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాను కాకినాడలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Mela Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

డెక్కన్ ఫైన్ కెమికల్స్ లిమిటెట్: ఈ సంస్థలో 24 ఖాళీలు ఉన్నాయి. ట్రైనీ కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ)/బీజెడ్సీ/డిప్లొమా(కెమికల్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి జీతం గ్రాస్-రూ.17 వేలు, నెట్ రూ.14,946 ఉంటుంది. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి.

డీమార్ట్: ఈ సంస్థలో 38 ఖాళీలు ఉన్నాయి. సేల్స్ అసోసియేట్స్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్ నుంచి డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వేతనం రూ.10 వేల వరకు ఉంటుంది. పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

CRPF Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9212 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఇతర వివరాలు:

- అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

- రిజిస్టర్ చేసుకున్న వారు ఈ నెల 17న ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ C/O DRDA, APSSDC District Office First Floor, Kakinada చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

- ఇతర వివరాలకు ఈ నంబర్ 9949156583ను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

First published:

Tags: Job Mela, JOBS, Private Jobs

ఉత్తమ కథలు