Home /News /jobs /

AP JOB MELA ON AUGUST 17 APPLICATIONS INVITING FOR VARIOUS JOB VACANCIES HERE DETAILS NS

Job Mela in AP: ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. రేపే జాబ్ మేళా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో మరో జాబ్ మేళాకు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17న జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Srikakulam, India
    ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మరో జాబ్ మేళాకు (Job Mela) సంబంధించి ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 17న శ్రీకాకుళంలో జాబ్ మేళా (Jobs) నిర్వహించనున్నట్లు తెలిపింది APSSDC. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది.

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    KIA Motors: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. Neem Trainee విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. EEE, Mech, ECE విభాగాల్లో డిప్లొమా, బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల వేతనంతో పాటు రూ. వేయి అటెండెన్స్ బోనస్ చెల్లించనున్నారు. ఉచిత రవాణా సందుపాయం ఉంటుంది. వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. అయితే.. కేవలం పురుషులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
    AP Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

    Ranstad: ఈ సంస్థలో 70 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18-35 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో పని చేయాల్సి ఉండండి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం ఉంటుంది.



    ఇతర వివరాలు:
    - అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
    - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు Nehru Yuva Kendram, Balaga Road, Srikakulam చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
    -ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
    - ఇతర పూర్తి వివరాలకు అభ్యర్థులు 8790500572, 7095731303 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Job Mela, JOBS, Private Jobs

    తదుపరి వార్తలు