హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Mega Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..

AP Mega Job Mela: ఏపీలో నేడు భారీ జాబ్ మేళా.. 1000 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ఈ రోజు మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో జాబ్ మేళా (Job Mela)కు సంబంధించి అధికారులు ప్రకటన విడుదల చేశారు. YOKOHAMA సంస్థలో ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలను (Job Interviews) నిర్వహించనున్నట్లు ప్రకటించారు అధికారులు. ఈ జాబ్ మేళా ద్వారా మొత్తం 1000 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ (Job Registration) చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఈ రోజు అంటే ఈ నెల 18న విశాఖపట్నంలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

  ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

  IAT (ఇండస్ట్రియల్ అప్రంటీస్ ట్రైనీ): ఈ విభాగంలో 500 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్, డీజిల్ మెకానిక్) చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2018-2021 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వస్సు 24 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14 వేలలోపు వేతనం చెల్లించనున్నారు.

  WAT (ఉమెన్ అప్రంటీస్ ట్రైనీ): ఈ విభాగంలో 500 ఖాళీలు ఉన్నాయి. మూడేళ్ల డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2018-2021 మధ్య పాసైన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వయస్సు 24 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేలకు పైగా వేతనం ఉంటుంది.

  SCIL Recruitment 2022: షిప్పింగ్ కార్పొరేషన్ లో ఖాళీలు.. బీటెక్, డిగ్రీ చేసిన వాళ్లు అర్హులు.. పూర్తి వివరాలివే..

  ఇతర వివరాలు:

  - అభ్యర్థులు ముందుగా ఈ https://apssdc.in/industryplacements/ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

  - రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.

  - హెచ్ఆర్ రౌండ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  - ఎంపికైన వారు అచ్యుతాపురం, వైజాగ్ చిరునామాలో పని చేయాల్సి ఉంటుంది.

  - ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో Resume, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

  - ఇంటర్వ్యూలను APSSDC District Office, Near Polytechnic College, Kancharapalem, Visakhapatnam-530007 చిరునామాలో నిర్వహించనున్నారు.

  - అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 7989158111 నంబర్ ను సంప్రదించవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Andhra Pradesh Government Jobs, Job Mela, JOBS, Private Jobs

  ఉత్తమ కథలు