AP JOB MELA GOOD NEWS FOR AP UNEMPLOYED JOB FAIR IN THREE PLACES KNOW APPLICATION DETAILS EVK
AP Job Mela | ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మూడు చోట్ల జాబ్ మేళా.. అప్లికేషన్ వివరాలు
వైసీపీ జాబ్ మేళా
AP Job Mela | ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కనీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. కనీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో(Private Sector) కల్పించడం జరుగుతుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా ఈనెల 23, 24 తేదీలలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో, ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్మేళా నిర్వహించబోతున్నాయి. మూడు చోట్ల కనీసం 5 వేల చొప్పున మొత్తం 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
10వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు అర్హులైన వారంతా ఆయా జాబ్మేళాలకు హాజరు కావొచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు.
ఏపీవీవీపీ కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ కర్నూలు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా పది విభాగాల్లో కలిపి 10 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతిలో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతనం అందిస్తారు. నోటిఫికేషన్, దరఖాస్తు సమాచారం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ ను సందర్శించాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేయడానికి ఏప్రిల్ 18, 2022 వరకు అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.