AP JOB MELA APPLICATIONS INVITING FOR JOB VACANCIES AT RELIANCE JIO HDFC JUST DIAL AND OTHER COMPANIES HERE FULL DETAILS NS
AP Job Mela: ఏపీలో భారీ జాబ్ మేళా.. 15 కంపెనీల్లో 1500 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం
ఏపీలో మరో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు APSSDC తెలిపింది. ఈ జాబ్ మేళాలో రిలయన్స్ జియో తో పాటు HDFC బ్యాంక్, Just Dial తదితర ప్రముఖ కంపెనీలు పాల్గొని నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి మరో భారీ జాబ్ మేళాకు సంబంధించిన ప్రకటన విడుదలైంది. Reliance Retail - Jio Mart, HDFC Bank, Meesho, Just Dail తో పాటు మొత్తం 15 ప్రముఖ సంస్థల్లో ఖాళీలను ఈ జాబ్ మేళా(Job Mela) ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ మేళా(Job Mela) ద్వారా మొత్తం వేయికి పైగా ఖాళీలను(Job Vacancies) భర్తీ చేయనున్నారు. టెన్త్ నుంచి పీజీ చేసిన వారి వరకు అన్ని విద్యార్హతలు కలిగిన వారు ఈ ఖాళీలకు (Jobs Vacancies) దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఈ జాబ్ మేళా(Job Mela)ను ఈ నెల 28న విజయవాడలో నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీన ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు.. 1.Pixentia Solution:ఈ సంస్థలో 10 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2.Apex Advanced Geospatial Private Ltd:ఈ సంస్థలో 40 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్చ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 3.Efftronics Systems Private Limited:ఈ సంస్థలో 80 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ, బీఎస్సీ(ఎలక్ట్రానిక్స్) అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 4.Domineer:ఈ సంస్థలో 10 ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. AP Job Mela: ఏపీలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ. 18,500 వేతనం.. ఇలా అప్లై చేసుకోండి
5.Coramandal International Limited:ఈ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. బీఎస్సీ, టెన్త్, ఇంటర్, గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 6.Reliance Retail-JIO Mart:ఈ సంస్థలో 400 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 7.Eureka Outsourcing Solutions (IDFC First Bank):ఈ సంస్థలో 120 ఖాళీలు ఉన్నాయి. ఇంటర్/గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 8.RAMCOR Group:ఈ సంస్థలో 85 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేయొచ్చు. BSNL Recruitment 2021: నిరుద్యోగులకు BSNL శుభవార్త.. అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. వివరాలివే
ఇతర వివరాలు:ఈ జాబ్ మేళాకు హాజరు కావాలనుకుంటున్న అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూకు ఫార్మల్ డ్రెస్ తో రావాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
-ఇంకా Resumes, విద్యార్హతల సర్టిఫికేట్ల కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, Aadhar/PAN/Voter ID కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు కోవిడ్-19 ప్రొటోకాల్స్ ను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 8074070914, 9347779032 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.