AP Inter Supplementary 2019 : మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. టైమ్ ‌టేబుల్ ఇదే..

AP Inter Supply Time Table | ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ సప్లీమెంటరీ ఎగ్జామ్స్ మే 14 నుంచి 22 వరకు జరుగనున్నాయి. ఉదయం ఫస్టియర్, సాయంత్రం సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి.

news18-telugu
Updated: April 16, 2019, 11:53 AM IST
AP Inter Supplementary 2019 : మే 14 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. టైమ్ ‌టేబుల్ ఇదే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష షెడ్యూల్ వచ్చేసింది. మే 14 నుంచి 22 వరకు సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 24ని చివరితేదీగా ప్రకటించారు. అదేవిధంగా ఏప్రిల్ 22 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్టియర్ స్టూడెంట్స్‌కి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ెగ్జామ్స్, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.

ఏపీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఈ నెల 12న రిలీజ్ అయ్యాయి. పరీక్ష రాసినవారిలో ఫస్టియర్ వారిలో 60 శాతం మంది ఉత్తీర్ణత నమోదు కాగా.. సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది హాజరుకాగా.. అందులో 6.3 లక్సల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా 3.3 లక్సల మంది విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలయ్యారు.

ap inter supplementary time table
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ టైమ్ టేబుల్


ఇవి కూడా చదవండి..

AP EAMCET 2019 : ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్స్ రిలీజ్.. దరఖాస్తు చేసేందుకు అవకాశముంది..

Scholarship : ఇంటర్‌ తర్వాత స్కాలర్‌షిప్.. ఇలా అప్లై చేయండి..
First published: April 16, 2019, 11:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading