AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై క్లారిటీ... రిజల్ట్స్ ఎప్పుడంటే

Andhra Pradesh Inter Results | ఇంటర్ ఫలితాలను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఫలితాల విడుదలపై ఇంటర్ విద్యామండలి క్లారిటీ ఇచ్చింది.

news18-telugu
Updated: May 28, 2020, 11:01 AM IST
AP Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలపై క్లారిటీ... రిజల్ట్స్ ఎప్పుడంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. జూన్ రెండోవారంలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మొదట సెకండియర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ తర్వాత ఫస్టియర్ రిజల్ట్స్ వస్తాయి. గత నాలుగేళ్లుగా ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి కరోనా వైరస్ సంక్షోభంతో పరిస్థితి మారిపోయింది. ఉన్నత విద్య, ఎంట్రెన్స్ టెస్టులు, కౌన్సిలింగ్ లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని మొదట ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 4 నుంచి 21 వరకు ఇంటర్ ఫస్టియర్, మార్చి 5 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. 5.10 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్, 5.17 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారని అంచనా. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అధికారిక వెబ్‌సైట్‌ https://bie.ap.gov.in/ లో ఇంటర్ ఫలితాలకు సంబంధించిన అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలు ఇదే వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.


Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

TCS Internship: ఇంట్లో కూర్చొనే టీసీఎస్ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు ఇలా

Scholarship: ఫారిన్‌లో చదువుకోవడానికి స్కాలర్‌షిప్... అప్లై చేయండిలాJob Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా
First published: May 28, 2020, 11:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading