AP INTER RESULTS 2022 RELEASED KNOW CENTRAL GOVERNMENT JOBS AND STATE GOVT JOBS FOR INTERMEDIATE PASSED STUDENTS SS
Govt Jobs with Intermediate: ఇంటర్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే
Govt Jobs with Intermediate: ఇంటర్ పాసయ్యారా? ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)
Govt Jobs with Intermediate | ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు (Central Govt Jobs), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు (State Govt Jobs) ఉంటాయి. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో క్లరికల్ స్థాయి ఉద్యోగాలకు ఇంటర్ పాసైతే చాలు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి. ఇంటర్ పాసైన తర్వాత బీటెక్, డిగ్రీ, ఇతర బ్యాచిలర్ కోర్సులు (Courses after Intermediate) చదవాలనుకుంటారు. ఇంటర్ పాసైన తర్వాత ఉద్యోగాల వేట మొదలుపెట్టేవారు ఉంటారు. ఇంటర్ అర్హతతో ప్రైవేట్ ఉద్యోగాలు మాత్రమే కాదు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే ఉద్యోగాలు (Railway Jobs), కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు (Central Govt Jobs) అప్లై చేయొచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) లాంటి సంస్థలు ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తుంటాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రతీ ఏటా కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ (CHSL) నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంటుంది. ఇంటర్మీడియట్, 10+2 పాసైనవారు ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయొచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా 2018లో 5649 పోస్టులు, 2019లో 4684 పోస్టులు, 2020 లో 4726 పోస్టులు భర్తీ చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇలా ప్రతీ ఏటా నాలుగైదు వేల పోస్టుల్ని భర్తీ చేస్తూ ఉంటుంది. లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి పోస్టులు ఉంటాయి. ఇంటర్ పాసైనవారు ఈ నోటిఫికేషన్‌కు అప్లై చేయొచ్చు.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అసిస్టెంట్ క్లర్క్, లోకో పైలట్, రైల్వే కానిస్టేబుల్, గ్రూప్ డీ పోస్టుల్ని కూడా ఇంటర్ అర్హతతో భర్తీ చేస్తూ ఉంటుంది. హెల్పర్, అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్, ట్రాక్ మెయింటైనర్, ట్రైన్ క్లర్క్ లాంటి పోస్టులు ఉంటాయి. ఇండియన్ ఆర్మీలో కూడా ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌కు ఇంటర్ పాసైనవారు అప్లై చేయొచ్చు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, సశస్త్ర సీమా బల్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో కూడా ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) అండ్ నావల్ అకాడమీ (NA) ఎగ్జామినేషన్ కోసం ఇంటర్ పాసైనవారి నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో కోర్సులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. కోర్సులు పూర్తైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో పోస్టింగ్ ఉంటుంది. మహిళా అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు.
ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ బ్యాంకులు ఇంటర్ అర్హతతో ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఉద్యోగాలు కోరుకునేవారు అఫీషియల్ వెబ్‌సైట్స్ ఫాలో అవుతూ ఉండాలి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే నోటిఫికేషన్స్ ఫాలో అవుతూ ఉండాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.