హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల..

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల..

AP Intermediate 1st year, 2nd year results 2022: ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

AP Intermediate 1st year, 2nd year results 2022: ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

AP Intermediate 1st year, 2nd year results 2022: ఏపీ ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. ఇంట‌ర్మీడియ‌ట్ ఫస్ట్ ఇయర్ (AP Inter 1st Year Results), సెకండ్ ఇయర్ (AP Inter 2nd Year Results) ఫ‌లితాల‌ను ఒకేసారి ప్రకటించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలకు సంబంధించిన సీడీలను ఆయన ఆవిష్కరించారు.  ఇంటర్ ఫస్టియర్, సెకండియర్, ఒకేషనల్ కోర్సులు కలిపి.. మేలో మొత్తం 9,41,350 మంది పరీక్షలు రాశారు. ఫస్ట్ ఇయర్‌ ఇంటర్ పరీక్షలకు 4,45,640 మంది హాజరైతే.. 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరంలో 54 శాతం ఉత్తీర్ణత నమోదయింది. సెకండ్ ఇయర్ పరీక్షలకు 4,23,455 మంది హాజరైతే.. 2,58,449 మంది పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 61 శాతం ఉత్తీర్ణత నమోదయింది.


మొదటి సంవత్సరంలో 49శాతం బాలురు, 60శాతం బాలికలు పాస్ అయ్యారు. రెండో సంవత్సరంలో 54శాతం బాలురు, 68శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. అంటే ఫస్టియర్, సెకండియర్‌లో బాలికలే పైచేయి సాధించారు. ఒకేషనల్‌ ఫస్టియర్లో 40శాతం, సెకండ్ ఇయర్ 55శాతం మంది పాస్ అయ్యారు. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 75శాతం మంది పాసయ్యారు. కడప జిల్లాలో 50శాతం ఉత్తీర్ణత నమోదయింది. ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 25 నుంచి జులై 5 వరకు వెసులుబాటు ఉంటుంది. అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలను ఆగస్టు 3 నుంచి 12 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్‌లో నిర్వహిస్తారు.

విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ , https://examresults.ap.nic.in వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.  వీటితో  పాటు News18 Telugu వెబ్‌సైట్‌ https://telugu.news18.com/ లో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.

ఏపీలో మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్‌ పరీక్షలు నిర్వహించారు. ఇటీవలే ఇంట‌ర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజ‌ర‌య్యారు.  ఏపీ విద్యాశాఖ రికార్డు స్థాయిలో.. పరీక్షలు ముగిసిన 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసింది.

First published:

Tags: AP inter board, AP Inter Exams 2022, AP Inter Results 2022, Ap intermediate results

ఉత్తమ కథలు