AP INTER RESULTS 2022 EDUCATION MIN BOTSA SATYANARAYANA TO RELEASE AP INTER 1ST AND 2ND YEAR RESULT CHECK LINKS AND DETAILS MKS
AP Inter results : ఏపీ ఇంటర్ ఫలితాలు -లింక్స్ ఇవే -న్యూస్ 18 తెలుగు వెబ్‌సైట్‌లోనూ రిజల్ట్స్ చూడండి..
ప్రతీకాత్మక చిత్రం
విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్ ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి నేడు (22 జూన్ బుధవారం) మధ్యాహ్నం 12.30కు విడుదల చేయనున్నారు. మీ ఫలితం ఇలా చెక్ చేసుకోండి..
లక్షల మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఇంటర్ ఫలితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి నేడు (22 జూన్ బుధవారం) వెల్లడయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు రిజల్ట్ ఎక్కడ, ఎలా చూసుకోవాలో వివరాలివే..
ఫస్ట్, సెకండ్ ఇయర్ కలిపి 10లక్షలకుపైగా విద్యార్థు ఫలితాలకు సంబంధించి ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ (AP Inter Board) అధికారికంగా ప్రకటన నిన్ననే చేయడం తెలిసిందే. విద్యార్థులు తమ ఫలితాలను https://bie.ap.gov.in/ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. లేదా.. https://examresults.ap.nic.in వెబ్ సైట్ ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లతో పాటు News18 Telugu వెబ్‌సైట్‌లో కూడా https://telugu.news18.com/ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
ఏపీలో మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు నిర్వహించగా, ఇటీవలే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇటీవల వెలువడిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో పాస్ పర్సంటేజీ తక్కువగా ఉండంపై ఆందోళన రేకెత్తడం, త్వరలో నిర్వహించే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైనవారిని కూడా రెగ్యులర్ గానే పరిగణిస్తామని ప్రభుత్వం చెప్పడం తెలిసిందే. మరి ఇంటర్ ఉత్తీర్ణత శాతం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇంటర్ ఫలితాలు చూసుకోడానికి అనుసరించాల్సిన స్టెప్స్ ఇవే..
ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను విద్యార్థులు ఫాలో కావాల్సి ఉంటుంది.. Step 1:విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఫలితాలను విడుదల చేయగానే అభ్యర్థులు https://bie.ap.gov.in/ లేదా.. https://examresults.ap.nic.in వెబ్ సైట్లను ఓపెన్ చేయాలి.
Step 2:అనంతరం హోం పేజీలో రిజల్ట్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. Step 3:కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీ రిజల్ట్ హోం స్క్రీన్ పై కనిపిస్తుంది. Step 4:రిజల్ట్స్ కాపీని ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.